For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. తొలి బౌలర్‌గా వరల్డ్ రికార్డ్!

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జోరు కొనసాగుతోంది. ఓవైపు టీమిండియా తడబాటు కొనసాగుతున్నా.. బుమ్రా మాత్రం సెన్సేషనల్ బౌలింగ్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు.

ఇప్పటికే టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలు రాయి అందుకున్న భారత బౌలర్‌గా రికార్డ్ సాధించిన బుమ్రా.. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

IND vs AUS Jasprit Bumrah Creates History In Boarder Gavaskar Trophy

ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. దాంతో ఈ సిరీస్‌లో ఇప్పటికే 30 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇరు జట్లలో మరే బౌలర్ కూడా బుమ్రాకు సమీపంగా లేరు. కనీసం 17 వికెట్లు కూడా తీయలేకపోయారు.

సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో బుమ్రాకు ఇది 9వ ఫైవ్ వికెట్ హాల్. ఈ సిరీస్‌లో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఐదు వికెట్ల ఘనతతో పాటు మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. అడిలైడ్‌లో 4 వికెట్లు తీసాడు. గబ్బా టెస్ట్‌లో 9 వికెట్లు తీసిన బుమ్రా.. తాజా మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రాకు ఇది 4వ ఫైవ్ వికెట్ హాల్ కాగా.. సౌతాఫ్రికాలో 3, ఇంగ్లండ్‌ గడ్డపై 2, వెస్టిండీస్ గడ్డపై 2 సార్లు ఐదు వికెట్లు ఘనతను అందుకున్న బుమ్రా.. భారత్‌లో రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. 340 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. టీ బ్రేక్ సమయానికి 54 ఓవర్లలో 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(9), విరాట్ కోహ్లీ(5), కేఎల్ రాహుల్(0) విఫలమైనా.. యశస్వి జైస్వాల్(63 బ్యాటింగ్), రిషభ్ పంత్(28 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. 105 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.

Story first published: Monday, December 30, 2024, 9:47 [IST]
Other articles published on Dec 30, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+