Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు!

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను బుమ్రా అధిగమించాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఈ ఫీట్ సాధించాడు.

ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(8), మార్నస్ లబుషేన్(1)లను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఈ ఘనతను అందుకున్నాడు. ఖవాజాను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. మార్నస్ లబుషేన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆసీస్ గడ్డపై కపిల్ దేవ్ 11 టెస్ట్‌ల్లో 51 వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా 10 టెస్ట్‌ల్లో 52 వికెట్లు తీసి ఈ ఫీట్ సాధించాడు.

Jasprit Bumrah Creates History Breaks Kapil Dev s Record

ఈ జాబితాలో బుమ్రా, కపిల్ దేవ్ తర్వాత అనిల్ కుంబ్లే(49), రవిచంద్రన్ అశ్విన్(40), బిషన్ సింగ్ బేడీ(35) ఉన్నారు. ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత మాత్రం ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ పేరిట ఉంది. నాథన్ లయన్ 18 టెస్ట్‌ల్లో 63 వికెట్లు తీసాడు. అతనికి చేరువగా అశ్విన్ ఉన్నాడు.

ఇక గబ్బా టెస్ట్‌ అనేక మలుపులు తిరుగుతోంది. ఓవైపు వర్షం.. మరోవైపు భారత బౌలర్ల అసాధారణ ప్రదర్శన అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. టెయిలెండర్ల అసాధారణ బ్యాటింగ్‌తో ఫాలో ఆన్ గండం గట్టెక్కిన భారత్.. బౌలింగ్‌లో నిప్పులు చెరుగుతోంది. జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 33 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో నాథన్ మెక్‌స్వీనీ(4), ఉస్మాన్ ఖవాజా(8), మార్నస్ లబుషేన్(1), మిచెల్ మార్ష్(2), స్టీవ్ స్మిత్(4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. క్రీజులో ట్రావిస్ హెడ్(13 బ్యాటింగ్)తో పాటు అలెక్స్ క్యారీ(6 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 229 పరుగులకు చేరింది. ఈ ఆధిక్యాన్ని 270లోపు కట్టడి చేసి ఆసీస్‌ను ఆలౌట్ చేస్తే టీమిండియా గెలుపు కోసం పోరాడవచ్చు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Wednesday, December 18, 2024, 9:22 [IST]
Other articles published on Dec 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+