Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరోన్ ఫించ్ ఔట్‌కు డీఆర్ఎస్‌కు లింక్ పెట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్

IND vs AUS: It is frustrating, its not a perfect system: Paine on DRS

హైదరాబాద్: అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్‌ఎస్)పై కెప్టెన్లు తన అసంతృప్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో డీఆర్ఎస్ కారణంగా పలు నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా వచ్చాయంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.

 దీనిపై టిమ్ పైన్ మాట్లాడుతూ

దీనిపై టిమ్ పైన్ మాట్లాడుతూ

దీనిపై టిమ్ పైన్ మాట్లాడుతూ "డీఆర్‌ఎస్ అనేది సరైన పద్ధతి కాదు. ఔట్లపై నిర్ణయాలు ప్రతి ఒక్కరిని విసిగెత్తిస్తున్నాయి. దీనిపై నా నుంచి ఎలాంటి సమాధానం లేదు. కానీ అదే సమయంలో డీఆర్‌ఎస్ నిర్ణయాలు చాలా చిత్రంగా అనిపిస్తున్నాయి. బ్యాట్స్‌మన్‌గా క్రీజులో ఉన్నప్పుడు ఒకలా.. బౌలింగ్ చేస్తున్నప్పుడు మరోలా అనిపిస్తోంది" అని అన్నాడు.

'కోహ్లీకి అవకాశమిచ్చినప్పుడు హర్మన్‌కు ఎందుకివ్వరు'?

 ఆరోన్ ఫించ్ ఔట్ విషయంలో

ఆరోన్ ఫించ్ ఔట్ విషయంలో

"ఆరోన్ ఫించ్ ఔట్ విషయంలో అలాగే జరిగింది. అశ్విన్ బౌలింగ్‌లో ఫించ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. డీఆర్‌ఎస్‌ను వినియోగించుకోకుండా సహచర బ్యాట్స్‌మన్ మార్కస్ హారిస్ సలహా తీసుకున్నాడు. కానీ రిప్లేలో బంతి.. బ్యాట్‌కు గానీ, గ్లవ్స్‌కు గానీ తాకలేదని స్పష్టంగా తేలింది" అని టిమ్ పైన్ వెల్లడించాడు.

బౌలర్‌తో చర్చించి డీఆర్‌ఎస్‌కు వెళ్లాలా

బౌలర్‌తో చర్చించి డీఆర్‌ఎస్‌కు వెళ్లాలా

"బౌలింగ్ చేస్తున్నప్పుడు అయితే బౌలర్‌తో చర్చించి డీఆర్‌ఎస్‌కు వెళ్లాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవడానికి వీలు అవుతుంది" అని టిమ్ పైన్ అన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు పెర్త్ వేదికగా డిసెంబర్ 14న జరగనుంది. దీంతో రెండో టెస్ట్‌కు ఆతిథ్యమిస్తోన్న పెర్త్ పిచ్ మా బౌలింగ్‌కు అతికినట్లు సరిపోతుందని పైన్ అన్నాడు.

పెర్త్‌లో కొత్తగా వేసిన పిచ్‌ గతంలో పిచ్‌ లాగానే

పెర్త్‌లో కొత్తగా వేసిన పిచ్‌ గతంలో పిచ్‌ లాగానే

పెర్త్‌లో కొత్తగా వేసిన పిచ్‌ గతంలో పిచ్‌ లాగానే పేస్‌, బౌన్స్‌కు సహకరిస్తుందని ఆశిస్తున్నానని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. ‘‘పెర్త్‌ పిచ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలని తహతహలాడుతున్నా. ఎప్పటిలాగే పేస్‌, బౌన్స్‌కు చక్కగా అనుకూలిస్తుందని ఆశిస్తున్నా. అలాంటి పిచ్‌ లభిస్తే టెస్టు క్రికెట్‌కు మేలు జరుగుతుంది'' అని లాంగర్‌ చెప్పాడు.

Story first published: Wednesday, December 12, 2018, 11:18 [IST]
Other articles published on Dec 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+