
కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించమని
సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)లో ఇప్పుడు ఇద్దరు సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ మాత్రమే మిగిలారు. వీరిద్దరికి కూడా పడటం లేదని చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న వివాదం కారణంగా అవి ఇప్పుడు బయట పడ్డాయి. జట్టు కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించమని ఎడుల్జీ కోరగా... దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన వినోద్ రాయ్ కొత్త కోచ్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల అడ్‌హక్ కమిటీని మంగళవారం ప్రకటించారు.

సచిన్, గంగూలీ, లక్ష్మణ్ అందుబాటులో ఉన్నారా
దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌తో పాటు అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి ఉన్నారు. దీంతో పాటు ఇతర అంశాలను కూడా ప్రశ్నిస్తూ ఎడుల్జీ సుదీర్ఘ లేఖ రాశారు. క్రికెట్ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ అందుబాటులో ఉన్నారా లేదా కనీసం తెలుసుకోకుండానే ముగ్గురితో అడ్‌హాక్ కమిటీ ఏర్పాటు చేయడంపై కూడా ఆమె వివరణ కోరారు. తాను లేకుండానే మిథాలీ, హర్మన్‌లతో సమావేశం ఎలా అవుతారని... బీసీసీఐ వ్యవహారాల్లో రాయ్‌తో పాటు తనకూ సమాన అధికారాలు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.

విరాట్ కోహ్లి పట్టు పట్టడం వల్లే
తన ఆమోదం లేకుండా రాయ్ సూచనలపై స్పందించవద్దని కూడా బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, సీఈఓలను ఎడుల్జీ కోరారు. మహిళల జట్టు కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించాలంటూ కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధన కోరడంలో తప్పేమీ లేదని ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. గతంలో విరాట్ కోహ్లి పట్టు పట్టడం వల్లే రవిశాస్త్రిని ఎంపిక చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాణ్ని విలన్‌గా
‘కోచ్‌గా పొవార్ కావాలంటూ హర్మన్, స్మృతి లేఖ రాయడంలో తప్పులేదు. వాళ్లు తమ అభిప్రాయాన్ని నిజాయతీగా చెప్పారు. కోహ్లి మాత్రం సీఈవో (జోహ్రి)కు పదేపదే సంక్షిప్త సందేశాలు పంపేవాడు. ఎవరో (రవిశాస్త్రి) దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువు తేదీని పొడిగించడాన్ని అప్పుడు వ్యతిరేకించాను. మొత్తానికి కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాణ్ని విలన్‌ను చేశారు. అతను గౌరవంగా తప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. అయితే ఆ సమయంలో అన్ని నిబంధనలు ఉల్లంఘించారు. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన కోసం కోచ్‌గా కొనసాగించమని ఇద్దరు ప్లేయర్లు కోరుతున్నారు. కొత్త కోచ్‌ను కమిటీ ఎంపిక చేసే వరకు వారి మాటకు విలువిస్తే తప్పేమిటి' అని ఎడుల్జీ ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications












