Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ దూరం!

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తొడ కండరాల గాయంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. రెండో వన్డే సంద్భంగా అతని ఎడమ తొడ కండరాలు పట్టేయడంతో ఆఖరి వన్డేకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ వన్డే సిరీస్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఐదు టీ20ల సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అతను గాయపడటం టీమిండియాను ఆందోళనకు గురి చేస్తోంది.

ఆసీస్ గడ్డపై శుభ్‌మన్ గిల్ సారథ్యంలోనే భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగింది. కానీ ఈ మ్యాచ్‌కు నితీష్ కుమార్ రెడ్డి‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ దూరమవ్వగా.. కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగారు. తొలి రెండు వన్డేల్లో విఫలమవడంతోనే నితీష్‌ను పక్కనపెట్టారని అంతా అనుకున్నారు. కానీ కాసేపటికే బీసీసీఐ నితీష్ గాయపడ్డాడని తెలియజేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

IND vs AUS Injured Nitish Kumar Reddy Ruled Out of 3rd ODI Doubtful for Australia T20 Series

'రెండో వన్డే సందర్భంగా నితీష్ ఎడమ తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతను మూడో వన్డే సెలెక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది.'అని బీసీసీఐ పేర్కొంది. ఈ గాయం నేపథ్యంలో నితీష్.. ఐదు టీ20ల సిరీస్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.

అయితే నితీష్ గాయం అంత తీవ్రమైనది కాదని, టీ20 సిరీస్ నేపథ్యంలోనే రెస్ట్ ఇచ్చారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 29(బుధవారం) నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి నితీష్ కోలుకుంటాడని టీమిండియా భావిస్తోంది. గాయంతో హా్ర్దిక్ పాండ్యా ఈ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. అతని గైర్హాజరీలో నితీష్ బరిలోకి దిగడం టీమిండియాకు కీలకం. లేకుంటే టీమ్ కాంబినేషన్‌ దెబ్బతింటుంది. ఈ సిరీస్‌తోనే నితీస్ ఆల్‌ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగే తొలి వన్డేకు ముందు రోహిత్ శర్మ చేతుల మీదుగా నితీష్ అరంగేట్ర క్యాప్ అందుకున్న విషయం విదితమే.

Story first published: Saturday, October 25, 2025, 11:24 [IST]
Other articles published on Oct 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+