Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: పాపం.. టీమిండియా బ్యాటర్ల తప్పేం లేదు! అంతలా టర్న్ అయితే ఎవ్వడూ ఆడలేడు!

IND vs AUS: Indore pitch turned 4.8 degrees in Day 1 first session

న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై బెంబేలెత్తిపోయారు. ఓవైపు వికెట్‌ నుంచి లభించిన సహకారంతో ఆసీస్ బౌలర్లు చెలరేగితే.. మరోవైపు భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్పిన్ ఆడటం కొత్త కాకపోయినా.. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్ట్‌ల్లో టర్నింగ్ ట్రాక్‌లపై రాణించినా.. ఇండోర్‌లో మాత్రం క్రీజులో నిలబడలేకపోయారు. వాస్తవానికి బ్యాటర్ల తప్పిదం కూడా ఏం లేదు. ఎందుకంటే ఇండోర్ వికెట్ చాలా దారుణంగా ఉంది. మాములుగా ఇలాంటి వికెట్‌ను టెస్ట్‌ల్లో నాలుగు, ఐదో రోజు ఆటలో చూస్తుంటాం.

టర్న్‌కు తోడు బౌన్స్..

టర్న్‌కు తోడు బౌన్స్..

పిచ్‌పై బాగా ఆడిన తర్వాత పగుళ్లు ఏర్పడి అనూహ్యంగా టర్న్ అవ్వడం జరుగుతుంటుంది. కానీ ఇండోర్‌లో తొలి రోజు బంతి టర్న్ అయ్యింది. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్ట్‌ల్లోని పిచ్‌ల కంటే రెండింతలు బాగా టర్న్ అయ్యింది. దానికి తోడు అనూహ్య బౌన్స్ ఉండటంతో భారత ఆటగాళ్లు తికమకపడ్డారు. ఏ షాట్ ఆడాలో తెలియక వికెట్లు పారేసుకున్నారు. రోహిత్ శర్మ ఔటైన విధానం చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. నాగ్‌పూర్ టెస్టులో బంతి యావరేజ్‌గా 2.5 డిగ్రీలు టర్న్ అయితే.. ఢిల్లీ టెస్టులో 3.8 డిగ్రీలు టర్న్ అయ్యింది. కానీ.. ఇండోర్ టెస్టులో ఫస్ట్ సెషన్ తొలి గంటలోనే యావరేజ్‌గా 4.8 డిగ్రీలు బంతి టర్న్ అవ్వడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.

బిత్తర పోయిన పుజారా..

టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఔటైన బంతి అయితే మరీ ఘోరం. నాథన్ లయన్ వేసిన బంతి ఆఫ్ స్టంప్ దిశగా పిచ్ అయ్యి అనూహ్యంగా టర్న్ అవుతూ బెయిల్స్‌ను ఎగరగొట్టింది. అనూహ్యంగా టర్న్ అయిన ఆ బంతిని పుజారా టచ్ కూడా చేయలేకపోయాడు. టీవీ రిప్లేల ప్రకారం పుజారాకు వేసిన బంతి 6.8 డిగ్రీలు టర్న్ అయినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ ఆడిన బంతి కూడా ఎక్స్‌ట్రా బౌన్స్‌తో 8.3 డిగ్రీలు టర్న్ అయ్యింది. దాంతో అతని బ్యాట్‌కు బంతి మిస్సయి స్టంపౌటయ్యాడు.

కోహ్లీ, భరత్ సైతం..

కోహ్లీ, భరత్ సైతం..

విరాట్ కోహ్లీ, కేఎస్ భర‌త్ ఎల్బీడబ్ల్యూగా ఔటైన బంతులు కూడా ఎక్కువగా టర్న్ అయ్యాయి. దాంతో భారత బ్యాటర్లు పెవిలియన్ చేరారు. అయితే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందని భావించిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ టర్నింగ్ ట్రాక్‌ను అంచనా వేయడంలో టీమ్‌మేనేజ్‌మెంట్ విఫలమయ్యింది. అయితే మ్యాచ్ సాగుతున్న కొద్ది టర్న్ తక్కువ్వడం కనిపించింది. దాంతో ఆసీస్ కాస్త స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలిగింది.

 ఆసీస్‌దే ఆధిపత్యం..

ఆసీస్‌దే ఆధిపత్యం..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 3 ఫోర్లతో 21), విరాట్ కోహ్లీ(52 బంతుల్లో 2 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బ్యాటర్లలో కోహ్లీ ఒక్కడే 50 బంతులు ఆడటం గమనార్హం. ఆసీస్ స్పిన్నర్లలో మాథ్యూ కుహ్నేమన్(5/16) ఐదు వికెట్లతో చెలరేగగా..నాథన్ లయన్(3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. టాడ్ మర్ఫీ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 54 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఉస్మాన్ ఖవాజా(147 బంతుల్లో 4 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Wednesday, March 1, 2023, 21:27 [IST]
Other articles published on Mar 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+