IND vs AUS: ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్ల ప్రకటన.. రోహిత్ శర్మ ఔట్, సిరాజ్‌కు చాన్స్, పంత్‌పై వేటు!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని వన్డే, టీ20, టెస్ట్ జట్ల వివరాలను భారత సెలెక్షన్ కమిటీ సోమవారం వెల్లడించింది. గాయంతో సతమతమవుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు. మన హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక ఊహించన విధంగానే యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై వేటు పడింది. వన్డే, టీ20 జట్లకు అతన్ని ఎంపిక చేయని సెలెక్షన్ కమిటీ టెస్ట్ టీమ్‌లో అవకాశం కల్పించింది. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లకు మూడు ఫార్మాట్లలో చోటు దక్కింది. ఇక సంజూ శాంసన్‌కు టీ20 జట్టులో అవకాశం లభించింది.

వరుణ్ చక్రవర్తికి పిలుపు..
ఐపీఎల్‌లో 5 వికెట్లతో రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి టీ20 జట్టులో అవకాశం దక్కింది. గాయాలతో ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్న భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలకు అవకాశం దక్కలేదు. రోహిత్ శర్మ గైర్హాజరీతో పరిమిత ఓవర్లలో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టెస్ట్‌ల్లో మాత్రం అజింక్యా రహానేనే వైస్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. అలాగే పరిమిత ఓవర్లలో వికెట్ కీపర్ కూడా రాహుల్ సేవలందించనున్నాడు.మూడు నెలల ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. నవంబర్ 27న మొదలయ్యే ఈ టూర్ కోసం భారత జంబో జట్టు ఐపీఎల్ ముగియగానే నే రుగా ఆసీస్‌కు వెళ్లనుంది. దుబాయ్ నుంచి సిడ్నీకి ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

భారత టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్(కీపర్, వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుంధర్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి

భారత వన్డే టీమ్:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(కీపర్, వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, శార్దుల్ ఠాకుర్

భారత టెస్ట్ టీమ్:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, హనుమ విహారీ, శుభ్‌మన్ గిల్, వృద్ధీమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్(కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్
రిషభ్ పంత్ కొంప ముంచిన అధిక బరువు.. ఆస్ట్రేలియా టూర్ నుంచి ఔట్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications