Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: మూడో టెస్ట్‌లో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?

IND vs AUS: India WTC Final Qualification Scenario After Indore test loss against Australia

హైదరాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జోరుకు ఆస్ట్రేలియా ఎట్టకేలకు కళ్లెం వేసింది. ఇండోర్ వేదికగా శుక్రవారం ముగిసిన మూడో టెస్ట్‌లో సమష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఓడినా.. ఆస్ట్రేలియా ఫైనల్ బెర్త్‌కు వచ్చే డోకాలేదు. కానీ కీలక మ్యాచ్‌లో ఓడిన టీమిండియా తమ అవకాశాలను మరింత సంక్లిష్టంగా మార్చుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే అహ్మదాబాద్ వేదికగా జరగనున్న చివరి టెస్ట్ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.

ఆసీస్ ఫైనల్ బెర్త్ కన్ఫామ్..

ఆసీస్ ఫైనల్ బెర్త్ కన్ఫామ్..

డబ్ల్యూటీసీ 2022-2023 సైకిల్‌లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 18 టెస్ట్‌లు ఆడి 11 విజయాలతో 68.2 విన్నింగ్ పర్సంటేజ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ 17 మ్యాచ్‌ల్లో 10 మాత్రమే గెలిచి 60.29 విన్నింగ్ పర్సంటేజ్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 53.33 విన్నింగ్ పర్సంటేజ్‌తో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ మూడు జట్లకే ఫైనల్ చేరే అవకాశం ఉంది. ఇందులో ఆసీస్ ఇప్పటికే తమ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. టీమిండియా బెర్త్ మరో విజయంపై ఆధారపడి ఉంది.

చివరి టెస్ట్ గెలిస్తే‌నే ఫైనల్ బెర్త్..

చివరి టెస్ట్ గెలిస్తే‌నే ఫైనల్ బెర్త్..

బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. అహ్మదాబాద్ వేదికగా జరిగే చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా 63 విన్నింగ్స్ పర్సంటేజ్‌తో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఆస్ట్రేలియా ఓడినా 65 విన్నింగ్ పర్సంటేజ్‌తో అగ్రస్థానంలోనే ఉంటుంది. కాబట్టి ఆ జట్టుకు వచ్చే సమస్య ఏం లేదు. ఒకవేళ అహ్మదాబాద్ టెస్ట్‌ను భారత్ డ్రా చేసుకుంటే.. 59 విన్నింగ్ పర్సంటేజ్‌తో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. అప్పుడు న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్ ఫలితంపై టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ఓడితే లంకకు ఛాన్స్..

ఓడితే లంకకు ఛాన్స్..

ఒక వేళ ఈ సిరీస్‌ను శ్రీలంక 2-0తో సాధిస్తే 61 పర్సంటేజ్‌తో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. శ్రీలంక ఒక్క మ్యాచ్ ఓడినా భారత్ ఫైనల్ చేరుతోంది. చివరి టెస్ట్‌లో టీమిండియా ఓడినా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. అయితే న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంక గెలిస్తే సంచలనమే అవుతోంది. ఎంత కష్టపడినా ఆ జట్టును కివీస్ వైట్ వాష్ చేయదు. కాబట్టి ఆఖరి టెస్ట్‌లో టీమిండియా ఓడినా.. గెలిచినా.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు వచ్చే డోకా లేదు. కానీ చివరి టెస్ట్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటే మానసికంగా ఆసీస్‌పై పై చేయి సాధించడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్ వేదికగా ఫైనల్లో ఆసీస్ ఢీకొనవచ్చు.

Story first published: Friday, March 3, 2023, 14:15 [IST]
Other articles published on Mar 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+