For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా టూర్ కోసం 17 కిలోల బరువు తగ్గిన యువ పేసర్!

'హర్షిత్ రాణా'.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా ఐపీఎల్ ఫ్యాన్స్ అతన్ని అస్సలు మరిచిపోరు. ముందుగా వివాదాస్పద వ్యవహార శైలితోనే హర్షిత్ రాణా అందరి దృష్టి ఆకర్షించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అప్పట్లో ఈ ఘటనపై దుమారాం రేగింది.

ఐపీఎల్ నిర్వాహకుల మందలింపుతో పాటు జరిమానాకు గురైనా.. తన దూకుడును మార్చుకోక ఓ మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. ఇవేవి తన ఆటను డిస్టర్బ్ చేయలేదు. 13 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో కేకేఆర్ టైటిల్ గెలవడంలో ఈ 22 ఏళ్ల యువ పేసర్ కీలక పాత్ర పోషించాడు.

IND vs AUS India pacer Harshit Rana lost 17 kgs before Border Gavaskar Trophy

ఆస్ట్రేలియా పర్యటనకు రాణా..
ఈ సంచలన ప్రదర్శనతో టీమిండియా పిలుపును అందుకున్నాడు. జింబాబ్వే, శ్రీలంక పర్యటనకు ఎంపికవ్వడంతో పాటు సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌‌కు కూడా సెలెక్ట్ అయ్యాడు. కానీ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు.

తాజాగా టెస్ట్ టీమ్ పిలుపును అందుకున్న హర్షిత్ రాణా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా తరఫున అరంగేట్రం చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు. అయితే ఈ స్థాయికి చేరడానికి తాను ఎన్నో కష్టాలు పడ్డానని హర్షిత్ రాణా చెప్పుకొచ్చాడు.

తరుచూ గాయాలయ్యాయి..
'కెరీర్ ఆరంభంలో నేను తరుచూ గాయాల బారిన పడేవాడిని. ఆ సమయంలో మా నాన్న అండగా నిలిచాడు. వెన్ను తట్టి ప్రోత్సహించాడు. ఆయుర్వేదంతో పాటు అనేక ఆసుపత్రులకు నన్ను తిప్పాడు. నా బాధను చూడలేక క్రికెట్ వదిలేయమని కూడా చెప్పాడు. కానీ ఆయన మాట వినలేదు.

2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయాలతో పుజారా, హనుమ విహారి, అశ్విన్, నవ్‌దీప్ సైనీ కనబర్చిన పోరాటం నుంచి స్పూర్తి పొందాను. టెస్ట్‌ల్లో టీమిండియాకు ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. తొడ కండరాల గాయంతో రంజీ ట్రోఫీ 2023-24కి దూరమవ్వడంతో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాను.

IND vs AUS India pacer Harshit Rana lost 17 kgs before Border Gavaskar Trophy

17 కిలోల బరువు తగ్గాను..
6 నెలల కాలంలో 17 కిలోల బరువు తగ్గాను. ఫిట్‌గా మారడంతో ఐపీఎల్‌లో రాణించగలిగాను. ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి భారత జట్టులోనే కొనసాగుతున్నా. ఈ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నా. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. ఆస్ట్రేలియా పోటీతత్వం నాకు బాగా నప్పుతుంది.

ఇంగ్లండ్‌‌తో లార్డ్స్ మైదానం వేదికగా టెస్ట్ మ్యాచ్ ఆడాలన్నది మా నాన్న కల. కానీ నాకు ఆస్ట్రేలియాతో ఆడటమే ఇష్టం. ఆస్ట్రేలియాలో ఆడే అవకాశం వస్తే ఎలా బౌలింగ్ చేయాలని బుమ్రా, సిరాజ్‌ను అడుగుతూనే ఉన్నా. గంభీర్ బ్రో నాకెప్పుడూ మద్దతుగానే ఉన్నాడు. మూడు ఫార్మాట్ల ఆటగాడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నా.'అని 22 ఏళ్ల హర్షిత్ రాణా చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, October 29, 2024, 11:20 [IST]
Other articles published on Oct 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+