IND vs AUS: ఇండోర్‌లో ఇండియాకు తిరుగులేదు.. ఆసీస్‌కు మళ్లీ దబిడి దిబిడే!

ఇండోర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. ఇండోర్ వేదికగా బుధవారం ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలనుకుంటుంది.
ఇప్పటికే ఇండోర్ చేరిన రోహిత్ సేన.. నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే తొలి రెండు టెస్ట్‌ల్లా కాకుండా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్‌లో కాస్త బౌన్స్ ఉండి పేస్‌కు అనుకూలించనుంది. ఇండోర్‌లోని గత రికార్డులను పరిశీలిస్తే ఇండియాకు తిరుగులేదు. ఇక్కడ ఇప్పటి వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగ్గా.. ఈ రెండింటిలోనూ భారత్ భారీ విజయాలతో గెలుపొందింది.

రెండింటిలోనూ భారత్‌దే విజయం..
మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఈ హోల్కర్ స్టేడియాన్ని 1990లో 30 వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించింది. ఈ వేదికగా మూడు ఫార్మాట్లలో టీమిండియాకు తిరుగులేదు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే భారత్ ఓటమిపాలైంది. 2016 అక్టోబర్ 8న తొలి అంతర్జాతీయ టెస్ట్‌కు ఈ మైదానం ఆతిథ్యం ఇచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 321 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగులతో విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఒక్క టెస్ట్ కూడా ఈ వేదికగా జరగలేదు. నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ ఆడనుంది.

కోహ్లీకి సూపర్ రికార్డు..
ఈ వేదికలో టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేకు మంచి రికార్డు ఉంది. రెండు మ్యాచ్‌ల్లో 148.50 యావరేజ్‌తో రహానే 297 పరుగులు చేసి ఈ వేదికలో హయ్యెస్ట్ స్కోరర్‌గా ఉన్నాడు. న్యూజిలాండ్‌పై 188 పరుగులు చేసిన రహానే.. బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఆ తర్వాత మయాంక్ అగర్వాల్(243), విరాట్ కోహ్లీ(228)లు ఈ వేదికగా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఉన్నారు. ప్రస్తుత జట్టులో కోహ్లీ ఒక్కడికే ఇక్కడ మంచి రికార్డు ఉంది. దాంతో మూడో టెస్ట్‌లో అతను సెంచరీ సాధిస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అశ్విన్, షమీకి తిరుగులేదు..
బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్‌కు ఈ వేదికగా మంచి రికార్డు ఉంది. ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 18 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ 11 వికెట్లతో తర్వాతి స్ధానంలో ఉన్నాడు. పిచ్ కాస్త బౌన్స్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో పేసర్లు కీలకం కానున్నారు.
ప్రస్తుత జట్టులో అశ్విన్, షమీ ఉండటంతో ఇండోర్‌లోనూ ఆసీస్‌కు కష్టాలు తప్పేలా లేవు. గత రెండు టెస్ట్‌ల్లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. కాస్త బ్యాటింగ్‌కు కూడా పిచ్ అనుకూలంగా ఉండనుంది. ఆరంభంలో ఆచితూచి ఆడితే భారీ స్కోర్లు సాధ్యమనిపిస్తోంది. రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్లు బ్యాటింగ్ ఎంచుకున్నాయి.

కోహ్లీకి డబుల్ సెంచరీ..
ఇండోర్ హోల్కర్ స్టేడియంలో మయాంక్ అగర్వాల్ 243 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగి ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో 2019లో 28 ఫోర్లు, 8 సిక్స్‌లతో డబుల్ సెంచరీ బాదాడు. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండోర్ వేదికగా తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 366 బంతుల్లో 211 పరుగులు చేశాడు. దాంతో మరోసారి కోహ్లీ చెలరేగుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications