
నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. 321/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 139.3 ఓవర్లలో 400 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా(70) త్వరగానే ఔటైనా.. అక్షర్ పటేల్(174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 84) సెంచరీ చేజార్చుకున్నా.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
టెయిలెండర్ మహమ్మద్ షమీ(47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37)విలువైన పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. నాథన్ లియోన్ ఓ వికెట్ తీసాడు. తొలి ఇన్నింగ్స్ తరహా బౌలింగ్ ప్రదర్శన చేస్తే టీమిండియా ఈ రోజు ఇన్నింగ్స్ తేడాతో గెలిచే అవకాశం ఉంది.

మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో జడేజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతి అద్భుతంగా టర్న్ అయ్యి జడేజా ఆఫ్ వికెట్‌ను ఎగరగొట్టేసింది. బంతిని అంచనా వేయడంలో విఫలమైన జడేజా మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో 8వ వికెట్‌కు నమోదైన 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన మహమ్మద్ షమీ.. అక్షర్ పటేల్‌కు అండగా నిలిచాడు.
అయితే 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లాంగాన్‌లో షమీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బోలాండ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో రెచ్చి పోయిన షమీ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మర్ఫీ బౌలింగ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ముర్ఫీ వేసిన 131వ ఓవర్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదిన షమీ.. అదే జోరు క్యాచ్ ఔటయ్యాడు. దాంతో 8వ వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సిరాజ్.. అక్షర్ పటేల్‌కు సహకరించినా.. కమిన్స్ భారత ఇన్నింగ్స్‌ను ముంగించాడు. సెంచరీ దిశగా సాగుతున్న అక్షర్ పటేల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే.