For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: నిప్పులు చెరిగిన కమిన్స్.. కుప్పకూలిన భారత్!

ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌లో భారత్ ఓటమి ఖారారైంది. 128/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(5/57) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. స్కాట్ బోలాండ్(3/51), మిచెల్ స్టార్క్(2/60) మిగతా వికెట్లు పడగొట్టారు. భారత బ్యాటర్లలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మూడో రోజు రోజు ఆట ఆరంభంలోనే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను మిచెల్ స్టార్క్‌ ఫస్ట్ ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పంత్(28) ఓవర్ నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు జోడించకుండానే వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అశ్విన్‌(7)ను కమిన్స్ ఔట్ చేయడంతో.. హర్షిత్ రాణా సాయంతో నితీస్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.

IND vs AUS India all out for 175 Australia need 19 to win in Pink Ball Test

కానీ కమిన్స్ హర్షిత్ రాణాను ఔట్ చేసి అతనిపై ఒత్తిడి పెంచాడు. కమిన్స్ బౌన్సర్లను బౌండరీలకు తరలించిన నితీష్.. అప్పర్ కట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన సిరాజ్ ఓ బౌండరీ బాది బోలాండ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

IND vs AUS India all out for 175 Australia need 19 to win in Pink Ball Test

ఆసీస్ 157 పరుగుల ఆధిక్యాన్ని రెండో ఇన్నింగ్స్‌లో అధిగమించిన భారత్ 18 పరుగుల లీడ్ మాత్రమే అందుకుంది. దాంతో ఆసీస్ ముందు 19 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 180 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Story first published: Sunday, December 8, 2024, 11:02 [IST]
Other articles published on Dec 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+