Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: హార్దిక్, కుల్దీప్ తీన్మార్.. టీమిండియా ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచిన ఆసీస్!

 IND vs AUS: Hardik Pandya, Kuldeep Yadav scalp three wickets each as India fold Australia for 269

చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. అద్భుత బౌలింగ్‌తో తక్కువ స్కోర్‌కే పరిమితం చేసినా.. చిన్న చిన్న భాగస్వామ్యాలతో ఆసీస్ 270 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47), అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/57), మహమ్మద్ సిరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లపై ఈ జోడీ విరుచుకుపడటంతో ఆసీస్.. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం హార్దిక్ పాండ్యాను రంగంలోకి దింపిన రోహిత్ శర్మ.. ఫలితాన్ని రాబట్టాడు. తన ఫస్ట్ ఓవర్‌లోనే హార్దిక్ పాండ్యా ట్రావిస్ హెడ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి 68 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. అనంతరం వరుసగా తన రెండు ఓవర్లలో స్టీవ్ స్మిత్(0), మిచెల్ మార్ష్‌ను ఔట్ చేసి ఆసీస్‌కు కోలుకోలేని దెబ్బతీసాడు. స్మిత్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన హార్దిక్ పాండ్యా.. మిచెల్ మార్ష్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ తన పనిని మొదలుపెట్టాడు. క్రీజులో సెట్ అయ్యే ప్రయత్నం చేసిన డేవిడ్ వార్నర్(23), మార్నస్ లబుషేన్(28)‌లను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్చేర్చాడు. 13 పరుగుల వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినీస్(25)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే అలెక్స్ క్యారీ(38)ని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో సీన్ అబాట్, అష్టన్ అగర్ పోరాడే ప్రయత్నం చేయగా.. అక్షర్ పటేల్ దెబ్బ కొట్టాడు. సీన్ అబాట్(26)ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. షాట్ పిచ్ డెలివరీతో అష్టన్ అగర్‌ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. తన మరుసటి ఓవర్‌లో మిచెల్ స్టార్క్(10)ను సిరాజ్ క్యాచ్ ఔట్ చేయడంతో ఆసీస్ ఆలౌటైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా.. చిన్న చిన్న భాగస్వామ్యాలతో ఆస్ట్రేలియా.. భారత్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది.

Story first published: Wednesday, March 22, 2023, 17:47 [IST]
Other articles published on Mar 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+