
మూడు మ్యాచ్‌ల్లోనూ.
ముఖ్యంగా విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే, చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్ల తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వాస్తవానికి తొలి వన్డేలో కూడా టీమిండియా కష్టపడుతూనే గెలిచింది. స్వల్ప లక్ష్యమే కావడంతో విజయాన్నందుకుంది. కొంచెం లక్ష్యం ఎక్కువగా ఉన్నా.. ఆ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిచేది కాదు. రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా మరీ నాసిరకంగా ఉంది. ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ మార్పులు స్పాట్ ఆన్‌గా లేవు. మరోవైపు మూడో టెస్ట్ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న స్టీవ్ స్మిత్.. ఆసీస్‌ను అద్భుతంగా నడిపించాడు. ఇండోర్ టెస్ట్‌లో విజయాన్నందించిన స్మిత్.. ఆఖరి టెస్ట్‌ను డ్రా చేసుకున్నాడు. తొలి వన్డేలో ఓడినా.. చివరి రెండు వన్డేల్లో సత్తా చూపించాడు. అతని ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ మార్పులు అద్భుతంగా ఉన్నాయి.

చేజేతులా..
చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆసీస్.. అద్భుత ఫీల్డింగ్ 40 పరుగులను అడ్డుకుంది. ఈ సూపర్ ఫీల్డింగే భారత ఆటగాళ్లపై ఒత్తిడి తెచ్చి వికెట్లను పారేసుకునేలా చేసింది. అక్షర్ పటేల్‌ను స్మిత్ రనౌట్ చేసిన తీరు అమోఘం. ముందుగా బౌలింగ్‌లో పట్టు విడిచి.. అనంతరం బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన రోహిత్ సేన సిరీస్‌ను ఆసీస్‌కు చేజేతులా సమర్పించుకుంది. 203/7 నిలిచిన ఆసీస్.. ఓ దశలో 220 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ కానీ తోకను కత్తిరించడంలోని బలహీనతను మరోసారి బయటపెట్టుకున్న భారత్.. ఆస్ట్రేలియాను 269 స్కోరు చేయనిచ్చి వారికి గెలిచే ఉత్సాహాన్ని అందించింది.

ధోనీ ఫార్మూలా మరిచి..
లక్ష్యచేధనలో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందివ్వగా.. విరాట్ కోహ్లీ క్రీజులో నిలబడి 185/4 మెరుగైన దశలో నిలిచినా.. అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. విరాట్ కోహ్లీ వికెట్‌తో మలుపు తిరిగిన మ్యాచ్.. చివరకు ఆసీస్ ఖాతాలో చేరింది. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడో వన్డేలోనూ గోల్డెన్ డకౌటవ్వడం.. క్రీజులో సెట్ అయిన హార్దిక్ పాండ్యా నిర్లక్ష్యపు షాట్‌తో వెనుదిరగడం భారత్ కొంపముంచింది. ఇక్కడ తన గురువు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ మార్క్ ఫార్మూలాను హార్దిక్ పాండ్యా మరిచిపోయాడు. చేజింగ్ చేస్తున్నప్పుడు బ్యాటర్లకు ఓపిక ఉండాలని, సాధ్యమైనంత వరకు మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని ధోనీ ఎప్పుడూ చెబుతుంటాడు.

హార్దిక్ ఔటవ్వకుంటే..
అలా చేయడం వల్ల ప్రత్యర్థి ఆటగాళ్లు ఒత్తిడికి గురై తప్పిదాలు చేస్తారని, వాటిని ఉపయోగించుకొని విజయం సాధించాలనేది ధోనీ ఫార్మూలా. చాలా మ్యాచ్‌ల్లో ధోనీ ఇదే ఫార్మూలాతో జట్టుకు విజయాన్నందించాడు. ఇదే హార్దిక్ పాండ్యా కూడా ఇదే సూత్రంతో బ్యాటింగ్ చేసి విజయాలందించాడు. కానీ నిన్నటి మ్యాచ్‌లో మాత్రం ఇది మరిచిపోయాడు. హార్దిక్ పాండ్యా క్రీజులో ఉంటే అతనికి జడేజా కూడా అండగా నిలిచేవాడు.
44వ ఓవర్‌లో ఔటైన హార్దిక్ పాండ్యా.. చివరి వరకు ఉంటే మ్యాచ్ భారత్‌వైపు మళ్లేది. షమీ వరుసగా 6,4 కొడితే మ్యాచ్ భారత్ వైపు మళ్లినట్లు అనిపించింది. అదే హార్దిక్ ఉండి ఉంటే కచ్చితంగా విజయం దక్కేది. సింగిల్స్, డబుల్స్‌తో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకొస్తే ఆసీస్ బౌలర్లే ఒత్తిడికి గురై లూజ్ బాల్స్ వేసేవారు. అప్పుడు చివరి ఓవర్‌లో 16 చేయాల్సి వచ్చినా.. భారత్ విజయాన్నందుకునేది. రోహిత్ శర్మ సైతం మ్యాచ్ అనంతరం ఇదే చెప్పాడు. ఒక బ్యాటర్ కడవరకు ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.


Click it and Unblock the Notifications












