Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: హార్దిక్ పాండ్యా అంటే హడలెత్తిపోతున్న స్మిత్.. ఏకంగా ఐదోసారి! (వీడియో)

 IND vs AUS: Hardik Pandya dismisses Steve Smith for the 5th time in ODIs

చెన్నై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంటే ఆస్ట్రేలియా తాత్కలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ హడలెత్తిపోతున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా ఐదోసారి స్మిత్ ఔటయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్(0).. హార్దిక్ పాండ్యా ధాటికి డకౌట్‌గా వెనుదిరిగాడు. వన్డేల్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో స్మిత్ ఔటవ్వడం ఇది ఐదోసారి.

వన్డే ఫార్మాట్‌లో స్మిత్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన తొలి పేసర్‌గా హార్దిక్ పాండ్యా గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా రెండో బౌలర్‌గా నిలిచాడు. వన్డేల్లో ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో స్మిత్ 6 సార్లు ఔటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, క్రిస్ బ్రాడ్, మార్క్ వుడ్ బౌలింగ్‌లో స్మిత్ మూడేసి సార్లు పెవిలియన్ చేరాడు.

హార్దిక్ పాండ్యా వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని స్మిత్.. బూమింగ్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్ టైమ్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తాకి కీపర్ చేతుల్లోకి దూసుకెళ్లింది. దాంతో స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47) మంచి శుభారంభం అందించారు. ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఈ జోడీ విరుచుకుపడటంతో ఆసీస్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది.


పవర్ ప్లే అనంతరం హార్దిక్ పాండ్యాను రంగంలోకి దింపిన రోహిత్ శర్మ.. ఎట్టకేలకు ఫలితాన్ని రాబట్టాడు. ట్రావిస్ హెడ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన హార్దిక్.. తన మరుసటి రెండు ఓవర్లలో స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్‌లను పెవిలియన్ చేర్చాడు. మిచెల్ మార్ష్‌ను క్లీన్ బౌల్డ్ చేసాడు. క్రీజులోకి వచ్చిన డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ జట్టును ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
Story first published: Wednesday, March 22, 2023, 15:26 [IST]
Other articles published on Mar 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+