
ఓపెనింగ్ జోడీపై చర్చ..
ఈ పరిస్థితుల్లో టీమ్ కాంబినేషన్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సమస్యగా మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మకు జతగా ఓపెనర్ ఎవరా? అనేది నిర్ణయించుకోలేకపోతుంది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించాలా..? పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరుస సెంచరీలతో చెలరేగుతున్న శుభ్‌మన్ గిల్‌కు ఇవ్వాలా? అనేది తేల్చుకోలేకపోతుంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 22, 23, 10, 2 పరుగులే చేశాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది ఓ డబుల్ సెంచరీతో పాటు నాలుగు సెంచరీలు బాదాడు. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్‌నే ఓపెనర్‌గా ఆడించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌నే ఆడించాలి..
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధించాలంటే రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయాలన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన హర్భజన్ సింగ్.. ఫామ్‌లో ఉన్న ఆటగాడికే ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు.'టెస్ట్ ఫార్మాట్‌లో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. ఏ సిరీస్‌లోనైనా ఓపెనర్లే పునాది వేస్తారు. నా వరకు అయితే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయాలి.

భారత్ గెలవాలంటే..
ఈ కాంబినేషన్ సిరీస్ మొత్తం కొనసాగించాలి. శుభ్‌మన్ గిల్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ కూడా మంచి ఓపెనరే.. కానీ ప్రస్తుతం అతను నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. మూడు ఫార్మాట్లలో అతని గణంకాలు అంతా బాగాలేవు. గిల్ మాత్రం గడిచిన కొద్ది నెలల్లోనే ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధించాలంటే రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయాలి.'అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

హర్బజన్‌పై విమర్శలు..
రవిచంద్రన్ అశ్విన్‌ను తక్కువ చేసేలా ట్వీట్ చేసిన హర్భజన్ సింగ్‌పై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా.. అతనిలా బౌలింగ్ చేసే యువ బౌలర్ మహేశ్ పితియాతో ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మాజీ ఓపెనర్ వసీం జాఫర్..ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ల బుర్రలో ఇప్పటికే అశ్విన్ ఉన్నాడని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు బదులు ఇచ్చిన హర్భజన్.. స్పిన్ పిచ్ ఫొటో తీసి దాన్ని షేర్ చేస్తూ.. 'ఆసీస్ బుర్రలో ముందుగా ఉంది ఇది' అంటూ బదులిచ్చాడు. అశ్విన్‌కు వస్తున్న పేరును ఓర్వలేకనే భజ్జీ ఇలా చేశాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గాలికి పోయే కంపను తగిలించుకోవడం అంటే ఇదేనని మరికొందరు హర్భజన్‌పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
