Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: మ్యాక్సీ మామ.. నీ ఫీల్డింగ్ సూపర్రా మామ! (వీడియో)

IND vs AUS: Glenn Maxwell Pulls Off An Blinder Video Goes Viral

మొహాలీ: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ తనదైన ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. బౌండరీ లైన్ వద్ద సూపర్ స్టంట్‌తో ఆకట్టుకున్నాడు. గాల్లోకి అమాంతం ఎగిరి సిక్సర్‌ను అడ్డుకొని 5 పరుగులు సేవ్ చేశాడు. మ్యాక్సీ సూపర్ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నీ ఫీల్డింగ్ సూపర్రా మామ అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం మ్యాక్సీ సూపర్ ఫీల్డింగ్‌కు సబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

అసలేం జరిగిందంటే.? నాథన్ ఎల్లిస్ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని భారత టెయిలెండర్ హర్షల్ పటేల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. హర్షల్ ధాటికి సిక్సర్‌గా దూసుకెళ్లిన బంతిని గ్లేన్ మ్యాక్స్‌వెల్ అద్భుతంగా అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి విసిరాడు. దాంతో సిక్సర్‌ కాస్త సిగిల్‌గా మారిపోయింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. కేఎల్ రాహుల్(35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్ రెండు, జోష్ హజెల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 10.1 ఓవర్లలో 2 వికెట్లకు 109 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు. కామెరూన్ గ్రీన్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) విధ్వసంకర ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్(13 బంతుల్లో 22) పర్వాలేదనిపించాడు.

Story first published: Tuesday, September 20, 2022, 22:14 [IST]
Other articles published on Sep 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+