Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకే గంభీర్ మాస్టర్ ప్లాన్!

టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టేందుకే అక్షర్ పటేల్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాన్ వేనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు రవీంద్ర జడేజాను ఎంపిక చేయలేదు. ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో టెస్ట్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసినా వన్డేలకు పరిగణలోకి తీసుకోలేదు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేశారు. ఈ ఇద్దరికీ తొలి రెండు వన్డేల్లో అవకాశం కల్పించారు.

అక్షర్ పటేల్‌ను నెంబర్ 5 బ్యాటర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. రెండు మ్యాచ్‌ల్లో అతను విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో మ్యాచ్‌లో 44 పరుగులు చేసాడు. వాషింగ్టన్ సుందర్ రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. బౌలింగ్‌లో జడేజా తరహాలోనే రాణిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగా.. ఆ టోర్నీ ఆడే సత్తా జడేజాకు ఉంది. కోహ్లీ, రోహిత్ శర్మ తరహాలోనే జడేజాకు పూర్తి ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే జడేజాను పక్కనపెట్టారనే విషయం అర్థమవుతుంది.

IND vs AUS Gautam Gambhir Aims to Prove Axar Patel Is a Better All-Rounder Than Ravindra Jadeja in ODIs

జడేజాకు ప్రత్యామ్నాయంగా ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లను సిద్దం చేస్తుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచే జడేజాకు వన్డేల్లో అవకాశాలు రావడం లేదు. సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరు జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా.. అశ్విన్ మూడు ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు.

జడేజా టీ20లకు వీడ్కోలు పలికి వన్డే, టెస్ట్‌లు ఆడుతున్నాడు. అతన్ని వన్డేలకు కూడా దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. జడేజా కంటే అక్షర్ మెరుగైన బ్యాటర్ అని నిరూపించేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నాడని, అందుకే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తున్నాడని చెప్పాడు.

Story first published: Thursday, October 23, 2025, 16:50 [IST]
Other articles published on Oct 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+