For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. 9 ఏళ్ల తర్వాత..!

టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా చర్రిత సృష్టించింది. 9 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సొంతగడ్డపై భారత్‌తో 400 ప్లస్ స్కోర్‌ను నమోదు చేసింది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ ఈ ఫీట్ సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. ట్రావిస్ హెడ్ (160 బంతుల్లో 18 ఫోర్లతో 152), స్టీవ్ స్మిత్(190 బంతుల్లో 12 ఫోర్లతో 101) శతకాలతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 101 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రీజులో అలెక్స్ క్యారీ(45 బ్యాటింగ్), మిచెల్ స్టార్క్ ఉన్నారు.

IND vs AUS First time Australia have managed to post 400 Plus total against India

9 ఏళ్ల తర్వాత..
2015 తర్వాత టెస్ట్‌ల్లో సొంతగడ్డపై భారత్‌‌తో ఆసీస్ 405 పరుగుల భారీ స్కోర్ చేయడం ఇదే తొలిసారి. ఆసీస్ చివరిసారిగా 2015లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 572/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆసీస్‌ గడ్డపై భారత్ 11 మ్యాచ్‌లు, 3 సిరీస్‌లు ఆడినా.. ఆతిథ్య జట్టు 400 ప్లస్ పరుగులు చేయలేకపోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆసీస్ బ్యాటింగ్‌కు దిగగా.. తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో 28/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్.. స్మిత్, ట్రావిస్ హెడ్ అసాధారణ బ్యాటింగ్‌తో భారీ స్కోర్ అందించారు. ఫస్ట్ సెషన్‌లో బుమ్రా చెలరేగి ఉస్మాన్ ఖవాజా(21), నాథన్ మెక్‌స్వీనీ(9), మార్నస్ లబుషేన్(12)లను ఔట్ చేసినా స్మిత్, ట్రావిస్ హెడ్ ఆచితూచి ఆడారు. దాంతో ఆసీస్ 104/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

ట్రావిస్ హెడ్, స్మిత్ విధ్వంసం..
రెండో సెషన్‌లో ఈ ఇద్దరూ పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో భారత బౌలర్లు తేలిపోయారు. 71 బంతుల్లో ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ సాధించగా.. స్మిత్ 128 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా బ్యాటింగ్ చేసిన హెడ్ 115 బంతుల్లో శతకం సాధఇంచాడు. దాంతో ఆసీస్ 234/3 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

మూడో సెషన్‌లోనూ ఈ ఇద్దరి జోరు కొనసాగింది. 112 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రావిస్ హెడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రోహిత్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. మరోవైపు స్మిత్ 185 బంతుల్లో శతకాన్ని సాధించగా.. ట్రావిస్ హెడ్ 157 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు.

బుమ్రా ఒంటరి పోరాటం..
భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని బుమ్రా విడదీసాడు. స్మిత్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. నాలుగో వికెట్‌కు నమోదైన 241 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరదించాడు.

తన మరుసటి ఓవర్‌లో మిచెల్ మార్ష్(5), ట్రావిస్ హెడ్‌లను పెవిలియన్ చేర్చిన బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఆచితూచి ఆడుతున్న ప్యాట్ కమిన్స్‌ను సిరాజ్ పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్‌తో కలిసి అలెక్స్ క్యారీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.

Story first published: Sunday, December 15, 2024, 15:58 [IST]
Other articles published on Dec 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+