Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రికీ పాంటింగ్.. ఈ సుద్దపూస మాటలే వద్దు!

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుద్దపూస మాటలు మాట్లాడవద్దని, గతాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్‌తో గొడవ పడిన విషయం తెలిసిందే.

ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో ఈ 19 ఏళ్ల కుర్రాడినే కవ్వించే ప్రయత్నం చేశాడు. తనకు ఎదురుగా నడిచిన సామ్ కోన్‌స్టాస్ భుజాన్ని కోహ్లీ బలంగా ఢీకొట్టాడు. అనంతరం అతనితో వాగ్వాదానికి దిగాడు. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దర్ని వారించారు.

IND vs AUS Fans Slams Ricky Ponting After He criticize Virat Kohli Over Sam Konstas Fight

ఈ ఘటనపై రికీ పాంటింగ్ ఘాటుగా స్పందించాడు. విరాట్ కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే సామ్ కోన్‌స్టాస్‌ను ఢీ కోట్టాడని అన్నాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఆ ఘటన సమయంలో కామెంట్రీ చెబుతున్న పాంటింగ్.. కోహ్లీ కావాలనే చేశాడనే విషయం రిప్లేలను చూస్తే అర్థమవుతుందన్నాడు. 'విరాట్ కోహ్లీ నడిచే విధానాన్ని చూడండి. అతను పిచ్ కుడివైపు నడుస్తూ గొడవకు ప్రేరేపించే ప్రయత్నం చేశాడు. ఇందులో నాకు ఎలాంటి సందేహం లేదు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ చర్యను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. కోహ్లీ తన తప్పిదాన్ని అంగీకరించడంతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించారు. కోహ్లీ ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారని ప్రచారం జరగ్గా.. మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ఫీజు కోతతోనే సరిపెట్టాడు.

అయితే కోహ్లీపై రికీ పాంటిం చేసిన కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్లెడ్జింగ్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిందే రికీ పాంటింగ్ అని, కవ్వింపులకు అతనే బ్రాండ్ అంబాసిడర్ అని, అలాంటిది అతను కోహ్లీ స్లెడ్జింగ్‌ను విమర్శిస్తున్నాడని మండిపడుతున్నారు.

గతంలో భారత ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. హర్భజన్ సింగ్ వికెట్ తీసి సంబరాలు చేసుకున్నప్పుడు అతనితో ప్రవర్తించిన తీరును మరిచిపోయాడా? అని గుర్తు చేస్తున్నారు. మంకీ గేట్ వివాదంలో హర్భజన్ సింగ్‌ను బాధ్యుడిని చేస్తూ చేసిన రచ్చ గురించి ఈ క్రికెట్ ప్రపంచం మరిచిపోదంటున్నారు. కెప్టెన్‌గా రికీ పాంటింగ్ ప్రత్యర్థి ఆటగాళ్లను ఎలా కవ్వించేదో.. అవహేళన చేసేదో 90 ఆటగాళ్లు, అభిమానులకు బాగా తెలుసంటున్నారు.

Story first published: Thursday, December 26, 2024, 18:45 [IST]
Other articles published on Dec 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+