IND vs AUS: భజ్జీ.. బర్నాల్ రాసుకో! నీకు ఎక్కడో కాలుతోంది.. పేలుతున్న మీమ్స్!

నాగ్‌పూర్: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సొంత జట్టుపైనే విమర్శలు గుప్పించాడు. టెస్ట్ క్రికెట్‌ను రక్షించాలనే హాష్ ట్యాగ్‌తో ట్విటర్ వేదికగా అతను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సిద్దం చేసిన పిచ్‌ను హర్భజన్ సింగ్ తప్పుబట్టాడు. నాగ్‌పూర్ పిచ్ తయారికీ సంబంధించి ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌ను బజ్జీ రీట్వీట్ చేశాడు.
టెస్ట్ క్రికెట్‌ను కాపాడాలి..
'భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ అంటేనే ఎంతో ఆసక్తికరం. కానీ క్రికెట్ కంటే పిచ్‌లే చర్చనీయాంశమవుతున్నాయి. సేవ్ టెస్ట్ క్రికెట్'అంటూ పేర్కొన్నాడు. ఇక హర్భజన్ సింగ్ చేసిన ట్వీట్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టర్నింగ్ ట్రాక్‌ను చూసి హర్భజన్ సింగ్ తట్టుకోలేకపోతున్నాడని మండిపడుతున్నాడు. భారత ప్రస్తుత స్పిన్నర్లు తనకంటే మెరుగైన ప్రదర్శన చేస్తారనే భయంతో ఓర్వలేకపోతున్నాడని, అతనికి ఎక్కడో కాలుతుందని, బర్నాల్ రాసుకోవాలని సూచిస్తున్నారు.
భజ్జీ.. సుద్దపూస మాటలు ఇప్పుడు ఎందుకు?
కొందరైతే.. 2004లో నాగ్‌పూర్ వేదికగా స్పోర్టింగ్ పిచ్‌లు రెడీ చేశామా? అందుకే భారత ఆటగాళ్లు గాయపడ్డారా? అని సెటైరికల్‌గా ప్రశ్నిస్తున్నారు. ఈ పిచ్‌పై ఇరు జట్లు ఆడుతున్నప్పుడు వచ్చిన సమస్య ఏందని మరొకరు నిలదీసారు. నీ మాటల వల్లే లొల్లి ఎక్కువైందని మరొకరు చురకలంటించారు. ఇలాంటి పిచ్‌లపై నువ్వు ఎన్నో మ్యాచ్‌లు ఆడావు.. ఇప్పుడు ఈ సుద్ద పూస మాటలు ఎందుకని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఆసీస్ మీడియా సైతం..
ఇక భారత్ తమకు అనుకూలంగా పిచ్‌ను తయారు చేసుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు, మీడియా గత రెండు రోజులుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇవేమి పట్టించుకోని టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం తమకు అనుకూలమైన వికెట్‌ను సిద్దం చేసుకుంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం కీలకం కావడంతో టర్నింగ్ ట్రాక్స్ రెడీ చేయాలని పిచ్ క్యూరేటర్లకు సూచించింది. రాహుల్ ద్రవిడ్ పట్టు బట్టి మరీ పిచ్‌ను టర్నింగ్ ట్రాక్‌గా మార్పించినట్లు తెలుస్తోంది.
ఆటపై ఫోకప్ పెట్టండి..
పిచ్ గురించి వస్తున్న ఆరోపణలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ఆటపై దృష్టి పెట్టాలని.. పిచ్‌పై కాదంటూ ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చాడు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. 'ఆటపై దృష్టి పెట్టండి.. పిచ్‌పై కాదు. ఇక్కడ ఆడే 22 మంది ఆటగాళ్లు నాణ్యమైన ఆటగాళ్లే' అంటూ సమాధానమిచ్చాడు. ఇక పిచ్ గురించి మాట్లాడుతూ.. ఇది స్పిన్నర్లకు సహకరిస్తుందని.. ఈ పరిస్థితుల్లో స్ట్రైక్ రొటేట్ చేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications