Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కోహ్లీ కాదు.. అతని వల్లే టీమిండియా గెలిచింది!

అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచి ఓటమెరుగని జట్టుగా టైటిల్ ఫైట్‌కు సిద్దమైంది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో టీమిండియా సమష్టిగా రాణించి 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది.

మరోసారి విరాట్ కోహ్లీ(98 బంతుల్లో 5 ఫోర్లతో 84) అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే విరాట్ కోహ్లీ కంటే.. శ్రేయస్ అయ్యర్ అసాధారణ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడని నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంలో విరాట్ కోహ్లీ పాత్ర ఎంత ఉందో..? అయ్యర్‌ది కూడా అంతే ఉందని కామెంట్ చేస్తున్నారు.

IND vs AUS Fans says Shreyas Iyer s run-out of Alex Carey was the turning point in the CT 2025 semi-final

మలుపు తిప్పిన రనౌట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ సూపర్ రనౌట్‌తో ఆసీస్ 15-20 పరుగులు తక్కువగా చేసింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని దూకుడుగా ఆడుతున్న అలెక్స్ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 61)ని శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ త్రోతో రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. అతని త్రో ధాటికి బంతి నేరుగా వికెట్లను తాకింది. క్యారీ రనౌటవ్వకుండా ఉంటే.. భారీ షాట్లు ఆడేవాడు. అప్పుడు ఆసీస్ 280 ప్లస్ రన్స్ టార్గెట్ నమోదు చేసేది. ఆ లక్ష్యాన్ని చేధించడం టీమిండియాకు కష్టంగా మారేది.

అతనికే బెస్ట్ ఫీల్డర్ అవార్డ్..
ఈ క్రమంలోనే బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చినా.. ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగినా.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించినా.. అయ్యర్ రనౌట్ చేయకుంటే టీమిండియా గెలిచేది కాదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీతో కలిసి శ్రేయస్ అయ్యర్ కీలక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడాని గుర్తు చేస్తున్నారు. అద్భుత ఫీల్డింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్‌కే బెస్ట్ ఫీల్డింగ్ అవార్డ్ దక్కింది. రవి శాస్త్రి చేతుల మీదుగా అయ్యర్ ఈ రికార్డ్‌ను స్వీకరించాడు.

Story first published: Wednesday, March 5, 2025, 15:50 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+