ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తొలి బంతి నుంచే దూకుడు కనబరుస్తున్నాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
విరాట్ కోహ్లీ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. తొలి బంతినే మిడాన్ దిశగా సిక్సర్ తరలించాడు. 14వ ఓవర్ తొలి బంతికి విరాట్ కోహ్లీని ఔట్ చేసిన స్కాట్ బోలాండ్.. రెండో బంతిని లెంగ్త్‌లో వేసాడు. పంత్ ఏ మాత్రం ఆలోచించకుండా మిడాన్ మీదుగా సిక్సర్ తరలించాడు. ఈ షాట్‌కు బోలాండ్‌తో పాటు ఆసీస్ ఆటగాళ్లు, కామెంటేటర్లు అవాక్కయ్యారు.

'అద్భుతం.. వాటే ప్లేయర్. ఏ గుండెరా అది'అంటూ కామెంటేటర్లు తమ వ్యాఖ్యానంతో పంత్‌ను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ ఔటయ్యాడనే భయం లేకుండా పంత్ దూకుడుగా ఆడటం చూసి అవాక్కవుతున్నారు.
వెబ్‌స్టర్ వేసిన 18వ ఓవర్‌లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించిన పంత్.. అతని మరుసటి ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌తో బౌండరీ బాదాడు. మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన పంత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 98 బంతులాడి 40 పరుగులే చేసిన పంత్.. తాజా ఇన్నింగ్స్‌లో మాత్రం మరో లెవెల్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. పంత్ బ్యాటింగ్ చూస్తుంటే.. తనదైన శైలిలో ఆడుతానని టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి పర్మీషన్ తెచ్చుకున్నట్లు అనిపిస్తోంది.
Aate hi RISHABH-PANTI shuru! 🔥
— Star Sports (@StarSportsIndia) January 4, 2025
When @RishabhPant17 steps in, the entertainment level goes 𝗨𝗽&𝗨𝗽 📈#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/tiJiuBOEDO
పంత్ సూపర్ బ్యాటింగ్‌తో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 4 వికెట్లకు 122 పరుగులు చేసింది. రిషభ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. 9/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్‌స్టర్(105 బంతుల్లో 5 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్(57 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/51), ప్రసిధ్ కృష్ణ(3/42)లతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా(2/33), నితీష్ కుమార్ రెడ్డి(2/32) రెండేసి వికెట్లు పడగొట్టారు. గాయంతో బుమ్రా మధ్యలోనే వెనుదిరిగినా.. సిరాజ్, ప్రసిధ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే.