IND vs AUS: 'ఇదేందయ్యా ఇది.. నేను ఏడ చూడలే'.. వార్నర్ బ్యాటింగ్‌పై పేలుతున్న సెటైర్లు!
ఇండోర్: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ( David Warner) మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత్‌తో రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్.. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin) ఎదుర్కొనేందుకు తన బ్యాటింగ్ శైలినే మార్చుకున్నాడు. లెఫ్టాండర్ అయిన వార్నర్.. అశ్విన్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు.
ఆసీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ప్రారంభానికి ముందే రైట్ హ్యాండర్‌గా గాడ్ తీసుకున్న వార్నర్.. మూడో బంతిని బౌండరీకి కూడా తరలించాడు. అయితే ఇదే ఓవర్ ఐదో బంతికి లబుషేన్(27)ను ఔట్ చేసిన అశ్విన్.. మరుసటి ఓవర్ తొలి బంతికే వార్నర్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

ఔటయ్యే బంతిని కూడా వార్నర్( David Warner) రైట్ హ్యాండర్‌గా ఎదుర్కోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో అశ్విన్( Ravichandran Ashwin)ను ధీటుగా ఎదుర్కొనేందుకు వార్నర్ చేసిన ప్రయత్నం విఫలమైంది. వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. 'ఇదేందయ్యా ఇది.. నేను ఏడ చూడలే' అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. గ్రీన్ అయితే 103 పరుగులు ఇచ్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications