Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: మిల్‌ గయా టీమిండియా 'హెడే'క్ టాబ్లెట్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను త్వరగానే పెవిలియన్ చేర్చింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆరంభంలోనే కూపర్ కంన్నోల్లీ(0) వికెట్‌ను కోల్పోయినా.. ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

1
63689

తొలి మూడు ఓవర్లను ఆచితూచి ఆడిన ట్రావిస్ హెడ్.. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్‌ నుంచి బౌండరీల మోత మోగించాడు. అతనికి లక్ కూడా కలిసి రావడంతో బౌండరీల మోత మోగించాడు. టీమిండియా అంటేనే చెలరేగిపోయే ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత అభిమానులను మరోసారి భయపెట్టాడు.

IND vs AUS Fans Feels Happy After Varun Chakaravarthy dismiss Travis Head in CT 2025 Semi Final

పేసర్లను సునాయసంగా ఆడుతున్న ట్రావిస్ హెడ్‌ను కట్టడి చేసేందుకు రోహిత్ శర్మ.. 6వ ఓవర్‌లోనే స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించాడు. అతని బౌలింగ్‌లోనూ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడటంతో.. రోహిత్ వరుణ్ చక్రవర్తీని త్వరగానే బౌలింగ్‌కు తీసుకొచ్చాడు. బంతి అందుకున్న వెంటనే అతను ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేశాడు.

వరుణ్ చక్రవర్తీ వేసిన 8వ ఓవర్ తొలి బంతికే ట్రావిస్ హెడ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. లాంగాఫ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో టీమిండియా ఆటగాళ్లంతా సంతోషంతో ఎగిరి గంతేసారు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌తో పాటు డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్లో ట్రావిస్ హెడ్ టీమిండియాకు ఎంత నష్టం చేశాడో అందరికీ తెలుసు. ఈ మ్యాచ్ ముందు కూడా ట్రావిస్ హెడ్‌ను కట్టడి చేస్తేనే టీమిండియాకు విజయం దక్కుతుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'మిల్‌ గయా టీమిండియా 'హెడే'క్ టాబ్లెట్.. టాబ్లేట్ నేమ్ వరుణ్ చక్రవర్తీ'అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) ఔటైనా.. మార్నస్ లబుషేన్‌తో కలిసి స్టీవ్ స్మిత్ ఆచితూచి ఆడుతున్నాడు. దాంతో ఆసీస్ 19.5 ఓవరల్లో 100 పరుగులు పూర్తి చేసింది.

Story first published: Tuesday, March 4, 2025, 16:20 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+