For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: మైదానంలోకి ఊహించని అతిథి.. ఆగిన ఆట! పరుగులు తీసిన సెక్యూరిటీ!

 IND vs AUS: Dog entered in the middle of the match, kept running on the field goes viral

చెన్నై: భారత్ -ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేపట్టగా.. మైదానంలో ఊహించని అతిథి వచ్చింది. దాంతో ఆటకు అంతరాయం కలగగా.. సెక్యూరిటీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఇంతకీ ఆ అతిథి ఎవరంటే శునకం. సెక్యూరిటీ కళ్లు గప్పిన ఓ డాగ్.. మైదానంలోకి దూసుకొచ్చింది. దాంతో ఆట కొద్దిసేపు ఆగిపోగా.. ఆ శునకాన్ని బయటకు వెళ్లగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. మైదానమంతా పరుగెత్తించిన ఆ శునకం చివరకు మైదానం వీడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే సెక్యూరిటీని పరుగెత్తించిన ఆ శునకం అందర్నీ నవ్వించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 43 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతి వేసే ముందు శునకం మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ డాగ్‌తో రవీంద్ర జడేజా కాస్త ఫన్ క్రియేట్ చేశాడు. దాన్ని పట్టుకుంటున్నట్లు సైగలు చేసి డాగ్‌ను బయపెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మైదానంలోకి వచ్చాడనే ఒకరంటే.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆ శునకాన్ని పంపించారని మరొకరు కామెంట్ చేశారు.


మైదానం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన తర్వాత ఆ డాగ్ ఎలా మైదానంలోకి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47), అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/57), మహమ్మద్ సిరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు.
Story first published: Wednesday, March 22, 2023, 18:17 [IST]
Other articles published on Mar 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+