Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ తీసుకున్న ఆ నిర్ణయం సరైంది కాదు: దినేశ్ కార్తీక్

 IND vs AUS: Dinesh Karthik questions Rohit Sharmas captaincy of the Ahmedabad Test

అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంపై వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో కెప్టెన్‌గా రోహిత్ తప్పు చేశాడన్నాడు. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న దినేశ్ కార్తీక్.. రోహిత్ శర్మ కెప్టెన్సీ తీరును విశ్లేషించాడు. అక్షర్ పటేల్‌ను సరిగ్గా వాడుకోలేదని చెప్పిన దినేశ్ కార్తీక్.. కొత్త బంతిని తీసుకున్న సమయం కూడా సరికాదన్నాడు.

రోహిత్ కెప్టెన్సీ నిర్ణయాలు..

రోహిత్ కెప్టెన్సీ నిర్ణయాలు..

'తొలి రోజు ఆటలో చాలా భాగం రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్‌, బౌలింగ్ మార్పులు స్పాట్‌ఆన్‌గా ఉన్నాయి. అతను కూడా చాలా ఉత్సాహంగా కనిపించాడు. సిల్లీ పాయింట్, షార్ట్‌ లెగ్‌ వంటి సాధారణ పద్ధతులను వాడకుండా భిన్నంగా ఫీల్డ్ సెట్ చేశాడు. ఫీల్డింగ్ పొజిషన్‌ను కట్టుదిట్టంగా పెట్టాడు. తొలి రోజు తొలి గంట ఆట మాత్రమే టీమిండియా కాస్త వెనుకడుగు వేసినట్లు కనిపించింది. కానీ, తొలి రోజు రోహిత్ తన సారథ్యంతో నాలుగు వికెట్లు రాబట్టగలిగాడు. మధ్యలో స్మిత్‌, ఉస్మాన్ ఖవాజా క్రీజ్‌లో ఉన్నప్పుడు అంత సులువుగా బౌండరీలు రాలేదు. అయితే, అతను కొత్త బంతిని తీసుకున్న సమయం మాత్రం సరైంది కాదు. అది గొప్ప నిర్ణయం కాదు.

అక్షర్‌కు బౌలింగ్ ఇవ్వలేదు..

అక్షర్‌కు బౌలింగ్ ఇవ్వలేదు..

ప్రస్తుతం భారత స్పిన్‌ క్రికెట్‌కు మూల స్తంభాలుగా ఉన్న రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌తో రోహిత్ ఎక్కువగా ఓవర్లను వేయించాడు. మూడో స్పిన్నర్‌గా తీసుకున్న అక్షర్ పటేల్‌‌ను సరిగ్గా వాడుకోలేకపోయాడు. కొత్త బంతితో కూడా అతను ఉత్తమంగా బౌలింగ్‌ చేయడం గతంలో మనం చూశాం. కొత్త బంతిని తీసుకున్నప్పుడైనా సరే.. ఆ బంతితో బౌలింగ్‌ చేసే అవకాశం ఇస్తే బాగుండేది. స్వదేశీ పిచ్‌ల మీద అక్షర్ పటేల్ బౌన్స్‌ రాబట్టగలడు' అని దినేశ్‌ కార్తీక్‌ చెప్పుకొచ్చాడు.

ఆసీస్ భారీ స్కోర్..

ఆసీస్ భారీ స్కోర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు చెరొక వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (17 బ్యాటింగ్), శుభ్‌మన్‌ గిల్ (18 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా 444 పరుగులను భారత్‌ వెనుకబడి ఉంది.

Story first published: Saturday, March 11, 2023, 8:44 [IST]
Other articles published on Mar 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+