IND vs AUS: శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. ట్రెండింగ్‌లో చాహల్ పెళ్లాం!
ఇండోర్: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. గత ఏడాదిగా గాయాలతో సతమతమైన ఈ స్టార్ బ్యాటర్.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105 పరుగులు చేసి తాను ఎంతటి విలువైన ఆటగాడినో చాటి చెప్పాడు.
రుతురాజ్ గైక్వాడ్(8) విఫలమవడంతో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 200 పరుగులు భాగస్వామ్యాన్ని అందించాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన అతను 86 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. వన్డేలో శ్రేయస్ అయ్యర్‌కు ఇది మూడో సెంచరీ.

వెన్నుగాయంతో గత ఏడాదిగా జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer).. ఆసియాకప్ 2023 టోర్నీతో రీఎంట్రీ ఇచ్చాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన అతను ఫిట్‌నెస్ సమస్యలతో ఇతర మ్యాచ్‌లు ఆడలేదు. ఆసీస్‌తో తొలి వన్డేల్లో దారుణంగా విఫలమైన అతను తప్పక ఆడాల్సిన మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించాడు.
ఇక శ్రేయస్ అయ్యర్ ఫామ్ అందుకోవడంపై భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ ప్రస్తావన తీసుకొస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ (Dhanashree Verma) వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చాహల్ లేకుండా శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ వర్మ పలు పార్టీలకు హాజరవ్వడం, చనువుగా ఉండటం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు ధనశ్రీ వర్మను ప్రస్తావిస్తూ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ఇన్నింగ్స్‌ను కొనియాడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. గ్రీన్ అయితే 103 పరుగులు ఇచ్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications