IND vs AUS: డేవిడ్ వార్నర్‌కు అస్వస్థత.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మాథ్యూ రేన్‌షా!

న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. తొలి రోజు ఆటలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అతను మిగతా మ్యాచ్ ఆడలేని పరిస్థితి నెలకొందని, కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మాథ్యూ రేన్‌షా ఆడుతాడని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫో పేర్కొంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా.. తొలి రోజు ఆటలో తగిలిన బంతులతో వార్నర్ అస్వస్థతకు గురైనట్లు తెలిపింది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అన్యూహ్యంగా వచ్చిన బౌన్సర్లను వార్నర్ ఆడలేకపోయాడు.

రాకాసి బౌన్సర్లు..
ముందుగా ఓ బౌన్సర్ అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని అతని మోచేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన వార్నర్.. ఫిజియోలతో ట్రీట్‌మెంట్ తీసుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత మరో రెండు, మూడు బౌన్సర్లు అతని హెల్మెట్‌కు బలంగా తాకాయి.
ఫిజియోలు వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించారు. గాయాలతో బ్యాటింగ్ కొనసాగించిన వార్నర్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అతను మైదానంలోకి రాలేదు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్ కూడా చేయలేదు.

అస్వస్థతకు గురయ్యాడని..
అయితే బ్యాటింగ్ సందర్భంగా తాకిన దెబ్బలతో వార్నర్ అస్వస్థతకు గురయ్యాడని టీమ్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. తొలి రోజు ఆట అనంతరం ఉస్మాన్ ఖవాజా సైతం వార్నర్ పరిస్థితి అంత బాగాలేదని చెప్పాడు. 'వార్నర్ గాయంపై మెడికల్ స్టాఫ్ శనివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అతను సౌకర్యంగా లేడు.
తలకు, భుజానికి బలమైన గాయాలయ్యాయి. అతనికి తలకు బంతి తగలడంతో అస్వస్థతకు లోనయ్యాడు. దాంతోనే మైదానంలోకి రాలేదు. అతనికి ఏమైందనేది మెడికల్ టీమ్ పరీక్షిస్తోంది'అని ఖవాజా చెప్పుకొచ్చాడు. హెల్మెట్‌కు పలుమార్లు బంతి తగలడంతో వార్నర్ వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే..?
మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఏ ఆటగాడైనా గాయపడితే అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్ బరిలో దిగుతాడనే సంగతి తెలిసిందే. గాయపడిన ఆటగాడి స్థానంలో బరిలోకి దిగే కంకషన్ సబ్‌స్టిట్యూట్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసేలా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను వాడుకోవచ్చు.
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణంతో 2019లో ఐసీసీ ఈ నిబంధనను ప్రవేశ పెట్టింది. కానీ ఇందుకోసం మ్యాచ్ రిఫరీ సమ్మతితో 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్' విధానాన్ని పాటించాల్సి ఉంటుంది.
బ్యాట్స్‌మెన్ అయిన డేవిడ్ వార్నర్ గాయపడితే.. అతడి స్థానంలో బ్యాట్స్‌మెన్ మాత్రమే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగాలి. ఒకవేళ ఆల్‌రౌండర్ మాత్రమే అందుబాటులో ఉంటే అతడు ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేయకూడదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications