Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆసీస్‌కు బిగ్ షాక్.. తొలి టెస్ట్‌కు కీలక వ్యక్తి దూరం!

భారత్‌తో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కీలక వ్యక్తి సేవలను కోల్పోనుంది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరి నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌కు దూరంగా ఉండనున్నాడు.

ఐపీఎల్ 2025 సీజన్ కోసం డానియల్ వెటోరి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో డానియల్ వెటోరీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనేందుకు డానియల్ వెటోరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తొలి టెస్ట్ జరుగుతుండగానే.. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.

IND vs AUS Daniel Vettori To Leave Australia s Coaching Duties For IPL 2025 Mega Auction

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డానియల్ వెటోరీ మెగా వేలంలో పాల్గొని ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాడు. ఇప్పటికే ఈ విషయమై డానియల్ వెటోరీ క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనుమతి తీసుకున్నాడు. ఈ విషయంలో డానియల్ వెటోరీకి మద్దతుగా ఉంటామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

'సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ అయిన డానియల్ వెటోరికి మేం అండగా ఉంటా. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు డానియల్ వెటోరికి అనుమతిచ్చాం. పెర్త్ టెస్ట్‌కు ముందు అతను పూర్తి ప్రిపరేషన్‌ను ముగించుకోనున్నాడు. ఐపీఎల్ మెగా వేలం ముగిసిన తర్వాత మళ్లీ ఆసీస్ జట్టుతో కలవనున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పూర్తయ్యేవరకు అందుబాటులో ఉంటాడు.'అని సదరు అధికారి తెలిపాడు.

Story first published: Monday, November 18, 2024, 18:23 [IST]
Other articles published on Nov 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+