Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కంటెంట్ ఉన్నోడు ఎలాంటి పిచ్‌లోనైనా ఆడుతాడు: ఆసీస్ అసిస్టెంట్ కోచ్

IND vs AUS: Daniel Vettori says I dont mind surfaces because I feel its same for everyone

న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో టీమిండియా తమకు అనుకూలమైన పిచ్‌లను తయారు చేసుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, మీడియా గగ్గోలు పెడుతోంది. టర్నింగ్ ట్రాక్స్ ఉపయోగించడం నేరమన్నట్లు బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ కామెంట్స్, ఆరోపణలను భారత మాజీ ఆటగాళ్లు తిప్పికొట్టారు.

ఆస్ట్రేలియా వేదికగా పేస్‌ పిచ్‌లను సిద్దం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ముగిసినా పిచ్‌లపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే పిచ్‌ల గురించి జరుగుతున్న చర్చపై ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియల్ వెటోరి మాత్రం స్పందించాడు.

కంటెంట్ ఉన్నోడికి..

కంటెంట్ ఉన్నోడికి..

భారత్‌కు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. కంటెంట్ ఉన్నోడికి పిచ్‌ ఎలా ఉన్నా అవసరం లేదని, ఎలాంటి పిచ్‌లోనైనా ఆడగలడని తెలిపాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. పిచ్, టాస్‌లను తాను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేశాడు.'పిచ్ గురించి నేను ఏ మాత్రం పట్టించుకోను. ఎందుకంటే ఒకే పిచ్‌పైన ఇరు జట్లూ బ్యాటింగ్ చేస్తాయి.

ఎవరు బాగా ఆడితే వాళ్లనే విజయం వరిస్తోంది. టాస్ గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను. మ్యాచ్ ఫలితాన్ని టాస్ నిర్ణయం శాసిస్తోందని నేను అనుకోను. ఎందుకంటే టాస్ గెలిస్తే ఏం చేయాలో.. ఓడితే ఎలా ఆడాలో ముందే నిర్ణయం తీసుకుంటాం. అలాంటప్పుడు టాస్ ఓడినా.. గెలిచినా జరిగే నష్టం ఏం ఉంటుంది.

కఠినమైన పిచ్‌ల్లో ఆడితేనే కదా..?

కఠినమైన పిచ్‌ల్లో ఆడితేనే కదా..?

కఠినమైన పిచ్‌ల్లోనే బ్యాటర్ల అసలు సత్తా తెలుస్తోంది. బ్యాటింగ్ అనుకూలమైన పిచ్‌పై ఎవ్వడైనా పరుగులు చేస్తాడు. అనుకూలంగా లేని పిచ్‌పైన పరుగులు చేయడమే కదా.. ప్రతిభ కలిగిన బ్యాటర్ చేయాల్సిన పని. అంతేకానీ పిచ్ బాగోలేదని మాట్లాడటం సరికాదు. కొన్ని సందర్భాల్లో మనం చేసిన 30 పరుగులు కూడా మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయి.

ఆ పరుగులు చేసేందుకు మనం ఎంత కష్టపడ్డామనేదే ముఖ్యమైన విషయం. ప్రతీ సవాల్‌ను స్వీకరించే ధైర్యం ఉండటమే గొప్ప క్రికెటర్‌కు ఉండాల్సిన ప్రధాన లక్షణం.

భారత్‌కే ఎక్కువ ఒత్తిడి..

భారత్‌కే ఎక్కువ ఒత్తిడి..

భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడేటప్పుడు ప్రతీ ప్లేయర్ కాస్త ఒత్తిడికి గురవుతాడు. అది సాధారణం. అయితే సొంతగడ్డపై భారత్‌కే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు ప్రతీ మ్యాచ్‌లోనూ సెంచరీ చేయాలని, ప్రతీ బంతికి వికెట్ తీయాలని అభిమానులు కోరుకుంటారు.

దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది'అని వెటోరి చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ కోసం డానియల్ వెటోరిని ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. భారత స్పిన్‌ను ఎదుర్కొనేందుకు వెటోరి పర్యవేక్షణలో సిద్దమవుతోంది.

Story first published: Tuesday, March 7, 2023, 16:56 [IST]
Other articles published on Mar 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+