Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: భారత్ తొండాట.. సీన్ అబాట్ క్యాచ్‌పై దుమారం!

ఇండోర్: భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో దుమ్మురేపడంతో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. అయితే శ్రేయస్ అయ్యర్ క్యాచ్ కోసం ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్ చేసిన ప్రయత్నం వృథా అయ్యింది.

భారత ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఓవర్ మూడో బంతిని సీన్ అబాట్ ఫుల్‌టాస్ వేయగా.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి నాన్‌స్ట్రైకర్ వైపు దూసుకెళ్లింది. బౌలింగ్ వేసిన సీన్ అబాట్(Sean Abbott) ఫాలో రన్నప్‌లోనే సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు.

IND vs AUS: Controversy Around Shreyas Iyer was not given out on Sean Abbott Catch in 2nd ODI


ఈ కళ్లు చెదిరే క్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్ సైతం నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఫీల్డ్ అంపైర్ల సూచనతో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా తేల్చాడు. బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు గుర్తించాడు. దాంతో పెవిలియన్ బాట పట్టిన శ్రేయస్ అయ్యర్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే ఆ ఆనందం రెండు బంతుల్లోనే ఆవిరైంది.

ఈ ఓవర్ నాలుగో బంతిని బౌండరీకి తరలించిన శ్రేయస్ అయ్యర్.. ఐదో బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(8) విఫలమైనా.. శుభ్‌మన్ గిల్(101 బ్యాటింగ్), శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు. రెండో వికెట్‌కు 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయ్యర్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ క్రీజులోకి రాగా.. శుభ్‌మన్ గిల్ శతకం పూర్తి చేసుకున్నాడు.

ఆ వెంటనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ సాయంతో రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఇక సీన్ అబాట్ క్యాచ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది ఔటేనని కొందరంటే.. కాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. భారత్ తొండాట ఆడుతుందని ఆరోపిస్తున్నారు.

Story first published: Sunday, September 24, 2023, 17:00 [IST]
Other articles published on Sep 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+