IND vs AUS: మైదానంలోకి కండోమ్ బెలూన్.. మెల్‌బోర్న్‌లో కలకలం! (వీడియో)
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో కండోమ్ బెలూన్ కలకలం సృష్టించింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పోటెత్తిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆటలో దాదాపు 87 వేల మంది అభిమానులు ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. అయితే అభిమానుల్లోని కొందరు ఆకతాయిలు.. కండోమ్ బెలూన్‌ను మ్యాచ్ జరుగుతుండగా గాల్లోకి వదిలేసారు.
అయితే అది మైదానంలోకి వెళ్లకుండా ప్రేక్షకుల స్టాండ్స్ వైపే గాల్లో చక్కర్లు కొట్టింది. మైదానంలోకి వెళ్తే ఆటకు అంతరాయం కలిగేది. కానీ అది గ్యాలరీ వైపు ఉండటంతో ఆటకు ఎలాంటి అంతరాయం కలగలేదు. ప్రస్తుతం ఈ కండోమ్ బెలూన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.

'భారత అభిమానులంతా ఈ కండోమ్ బెలూన్ ఎప్పుడు పగులుతుందా? అని ఆతృతతో చూస్తున్నారు'అనే క్యాప్షన్‌తో ఓ నెటిజన్ ఈ వీడియోను ఎక్స్‌వేదికగా పంచుకున్నాడు. ప్రముఖ కండోమ్ కంపెనీ డ్యూరెక్స్‌కు ట్యాగ్ చేశాడు. ఏం తీటగాళ్లు ఉన్నార్రురా.. అని కొందరంటే.. డాట్స్ ఉన్నాయా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు భారత బ్యాటర్ల కంటే కండోమ్ బెలూన్ పర్ఫామెన్స్ బాగుందని సెటైర్లు పేల్చారు. భారత ఓపెనర్ల కంటే ఎక్కువ సేపు గాల్లో ఉందని కామెంట్ చేశారు.
Indian fans are busy watching whether the condom balloon will burst
— Kartik Kannan (@kartik_kannan) December 27, 2024
Well played @durex#AUSvIND #MelbourneTest #Condom pic.twitter.com/iTlB0FHmQy
ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(118 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకం చేజార్చుకోగా.. విరాట్ కోహ్లీ(86 బంతుల్లో 4 ఫోర్లతో 36) మరోసారి నిరాశపరిచాడు. క్రీజులో రిషభ్ పంత్(6 బ్యాటింగ్)తో పాటు రవీంద్ర జడేజా(4) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీసారు.
అంతకుముందు 311/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 140) భారీ శతకంతో చెలరేగగా..సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72)హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్‌కు రెండు వికెట్లు దక్కగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications