Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: పాపం పుజారా.. ఇక చేసేదేమి లేక

టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా తన కెరీర్‌పై ఆశలు వదులకున్నాడు. భారత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేసిన పుజారా.. మెనేజ్‌మెంట్ పట్టించుకోకపోవడంతో చేసేదేమి లేక కీలక నిర్ణయం తీసుకున్నాడు.

కామెంటేటర్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. అప్‌కమింగ్ ఇండియా వర్సెస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పుజారా స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. తన జిడ్డు బ్యాటింగ్‌తో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన పుజారా.. ఇప్పుడు తన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు.

IND vs AUS Cheteshwar Pujara will be doing commentary for Star Sports Hindi in Border Gavaskar Trophy

గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21లో ఆటగాడిగా పుజారా కీలకంగా వ్యవహరించాడు. సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ గడ్డపై భారత్ గెలిచిన రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లోనూ పుజారా బ్యాటర్‌గా సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో చివరిసారిగా బరిలోకి దిగిన పుజారా.. పేలవ ఫామ్‌తో జట్టుకు దూరమయ్యాడు.

ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో రాణించినా.. కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటినా భారత సెలెక్టర్లు పట్టించుకోలేదు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడంతో పాటు అటాకింగ్ మోడ్‌లో టెస్ట్ క్రికెట్‌ ఆడాలనే టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయంతో పుజారాకు అవకాశాలు దక్కలేదు. దాంతో అతని కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది.

2010లో ఆస్ట్రేలియాతో బెంగళూరు వేదికగా జరిగిన టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పుజారా.. ఇప్పటి వరకు 103 టెస్ట్‌లు ఆడి 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు.. 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 206 నాటౌట్. తనదైన డిఫెన్స్‌తో పుజారా టీమిండియా నయావాల్‌గా గుర్తింపు పొందాడు.

అలాంటి పుజారా ఇప్పుడు అవకాశాలు లేక కామెంటేటర్‌గా మారడంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం పుజారా అని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Monday, November 18, 2024, 9:52 [IST]
Other articles published on Nov 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+