Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: భారత్‌తో సిరీస్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. నాగ్‌పూర్ టెస్ట్‌‌కు ఆ స్టార్ ఆల్‌రౌండర్ దూరం!

IND vs AUS: Cameron Green unlikely to play Nagpur Test over his finger injury

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోసం భారత్ రానున్న ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే చేతి వేలి గాయంతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరమవ్వగా.. మరో స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. చేతి వేలి గాయానికి గురైన అతను ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కామెరూన్ గ్రీన్‌ను ఆడించాలా? వద్దా? అనే సందిగ్దంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భారత్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆసీస్.. పకడ్బందీగా ప్రిపేర్ అవుతోంది.

సిడ్నీలో ముమ్మర సాధన..

సిడ్నీలో ముమ్మర సాధన..

భారత పర్యటనకు వచ్చే ముందే సిడ్నీ వేదికగా ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంటుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఆడే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించగా..

చోటు దక్కించుకున్న ఆటగాళ్లంతా ప్రస్తుతం ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొని ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఈ క్యాంప్‌నకు కామెరూన్ గ్రీన్ కూడా హాజరవుతున్నాడు. అయితే ఈ ఆల్ రౌండర్ ప్రస్తుతానికి బ్యాటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాడు. మీడియం పేసర్ అయిన గ్రీన్‌ను తుది జట్టులోకి తీసుకుంటే మరో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను జట్టులోకి ఎంపిక చేసుకునేవెసులు బాటు ఆస్ట్రేలియాకు ఉంటుంది. ఈ క్రమంలోనే అతను బౌలింగ్ చేయడం ఆ జట్టుకు కీలకంగా మారింది.

మెడికల్ రిపోర్ట్ కోసం వెయిటింగ్..

మెడికల్ రిపోర్ట్ కోసం వెయిటింగ్..

అయితే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో గ్రీన్ చేతి వేలికి గాయమైంది. వేలి ఎముక దెబ్బతినడంతో అతనికి సర్జరీ కూడా జరిగింది. గాయం నేపథ్యంలో అతడు నాలుగైదు వారాలు బౌలింగ్ చేయకూడటమే మంచిదని వైద్యులు సూచించారు. ఇందుకు సంబంధించిన తుది నివేదిక ఇంకా రావాల్సి ఉంది. వాస్తవానికి గత వారమే ఈ రిపోర్ట్ రావాల్సి ఉన్నా.. అది సోమవారానికి (జనవరి 30) వాయిదా పడింది. సోమవారం నాటి నివేదికను బట్టి గ్రీన్ బౌలింగ్ చేస్తాడా? చేయడా? అన్నది తేలనుంది. ఈ రిపోర్ట్ ప్రకారమే అతన్ని తొలి టెస్ట్ ఆడించాలా? లేదా? అనేదానిపై ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోనుంది.

గాయం నయం కాకుంటే..

గాయం నయం కాకుంటే..

ఒకవేళ రిపోర్టులో ఏదైనా తేడా వస్తే మాత్రం గ్రీన్‌ను తొలి టెస్ట్‌కు దూరంగా ఉంచే అవకాశాలున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి మేజర్ టోర్నీ నేపథ్యంలో అతన్ని కాపాడుకునే ప్రయత్నం క్రికెట్ ఆస్ట్రేలియా చేయనుంది. గాయం నయం కాకుంటే మాత్రం భారత్‌కు వచ్చే ఆస్ట్రేలియాతో జట్టుతోనూ గ్రీన్ వచ్చే అవకాశాలు ఉండవని ఆ దేశ క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ టెస్టులో గ్రీన్ ఆడతాడా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొద్దిరోజులుగా గ్రీన్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

ఫిబ్రవరి 9 నుంచి

ఫిబ్రవరి 9 నుంచి

ఇక ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 2004 నుంచి సొంతగడ్డపై భారత్‌ను ఓడించలేక తంటాలు పడుతున్న ఆసీస్.. ఈసారి ఆ లోటును పూరించడానికి పూర్తి ప్రణాళికతో ఇక్కడకు వస్తున్నది. భారత్ లో అనుకూలించే స్పిన్ కు అనుకూలించే ఇక్కడి పిచ్ లకు అనుగుణంగా టీమ్ లో ఏకంగా ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు, ఇద్దరు పార్ట్ టైమ్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. ఈ రెండు విజయాలకు బదులు తీర్చుకోవాలని కూడా ఆసీస్ భావిస్తోంది.

Story first published: Sunday, January 29, 2023, 16:05 [IST]
Other articles published on Jan 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+