ముందు మీది మీరు కడుక్కోండి.. ట్రోలర్స్‌పై భువనేశ్వర్ కుమార్ సతీమణి ఘాటు వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సతీమణి నుపుర్ నగర్ తనదైన శైలిలో ట్రోలర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమికి కారణమయ్యాడని ఓ వర్గం అభిమానులు భువనేశ్వర్ కుమార్‌పై ట్రోలింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. డెత్ ఓవర్లలో భువీ మరోసారి విఫలమయ్యాడని, అతనితో ప్రపంచకప్ బరిలోకి దిగితే టీమిండియా కొంపమునిగినట్లేనని విమర్శించారు. ముఖ్యంగా అతను వేసిన 19వ ఓవర్ కారణంగానే టీమిండియా ఓటమిపాలైందని మండిపడ్డారు. మరికొందరు హద్దులు ధాటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ట్రోలింగ్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన నుపర్ నగర్.. ఘాటుగా బదులిచ్చింది.

మీది మీరు చూసుకోండి...
ట్రోల్స్ చేసేవాళ్ల గురించి పట్టించుకునేవారెవరూ లేరని, తమను విమర్శించే సమయాన్ని మీ జీవితం బాగు చేసుకోవడానికి కేటాయిస్తే బాగుంటుందని ఘాటుగా రాసుకొచ్చింది. 'ఈ రోజుల్లో చాలా మంది పని పాట లేకుండా ఉంటున్నారు. వారి కోసం ఏమైనా చేయడానికి టైమ్ ఉండదు కానీ ద్వేషం, అసూయను వ్యాప్తి చేయడానికి మాత్రం వాళ్ల దగ్గర టైమ్ ఉంటుంది. వారందరికీ నా సలహా ఏంటంటే.. మీ మాటల వల్ల ఇక్కడ ఎవరూ ప్రభావితం కారు. అంతేగాక మీ ఉనికి గురించి కూడా ఎవరూ పట్టించుకోరు. కావున దయచేసి ఇతరుల మీద ద్వేషం చూపించడానికి కేటాయించే సమయాన్ని మీ జీవితాలను బాగు చేసుకోవడం కేటాయించండి. అది చాలా కష్టమే అనుకోండి. కానీ ట్రై చేయండి.'అని తన ఇన్‌స్టా స్టోరీలో ఘాటుగా రాసుకొచ్చింది.

భువీ వైఫల్యం లేదంటారా?
ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నుపుర్ నగర్‌ను వెనుకేసుకొస్తుంటే మరికొందరు మాత్రం ఘాటుగా విమర్శిస్తున్నారు. భర్తను వెనుకేసుకొస్తున్నావ్ కానీ.. అతని వల్లే భారత్ కీలక మ్యాచ్‌లు ఓడిపోయిందనే విషయం నీకు తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. భువీ విఫలమవ్వలేదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలవా? అని నిలదీస్తున్నారు. అతని అసమర్థత కారణంగానే టీమిండియా.. ఆసియాకప్ ఫైనల్ చేరకుండా ఇంటిదారి పట్టిందని, ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ అదే వైఫల్యం కొనసాగిస్తున్నాడని విమర్శించారు. ఇలానే ఆడితే ప్రపంచకప్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు.

గవాస్కర్ సైతం..
భువనేశ్వర్ గత మూడు మ్యాచ్ లలో డెత్ ఓవర్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. 17, 19వ ఓవర్ బౌలింగ్ చేసి ఆ ఓవర్లలో 15, 16 పరుగులిచ్చాడు. భువీ ఆటపై సునీల్ గవాస్కర్ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. సీనియర్ బౌలర్ అయిన భువీ ఇలా బౌలింగ్ చేస్తే ఎలా..? అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలానే ఆడితే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కష్టాలు తప్పవని హెచ్చరించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications