India vs Australia నాలుగో టెస్ట్.. పిచ్ ఎలా ఉందంటే..?

అహ్మదాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తుది దశకు చేరింది. అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న చివరి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరపడనుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే పిచ్‌ల వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. భారత్ తమకు అనుకూలమైన స్పిన్ వికెట్లను తయారు చేసుకుంటుందని ఆసీస్ మీడియా, ఆ దేశ మాజీ క్రికెటర్లు గగ్గోలు పెట్టారు.
ఈ లొల్లిని ఏ మాత్రం పట్టించుకోని భారత్.. వరుసగా మూడు టెస్ట్‌ల్లోనూ స్పిన్ టెస్ట్‌లనే సిద్దం చేసింది. గింగిరాలు తిరిగే పిచ్‌లతో తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన భారత్.. మూడో టెస్ట్‌లో మాత్రం విఫలమైంది. పిచ్‌కు విపరీతంగా సహకరించిన ఇండోర్ పిచ్‌పై రోహిత్ సేన బోల్తా కొట్టింది.

ఐసీసీ కన్నెర్ర చేయడంతో..
నాణ్యత విషయంలో తొలి రెండు టెస్టుల పిచ్‌లకు పాసు మార్కుల వేసిన ఐసీసీ.. మూడో టెస్టు పిచ్‌పై మాత్రం కన్నెర్ర చేసింది. పేలవ రేటింగ్‌తో పాటు మూడు డీమెరిట్ పాయింట్స్ ఇచ్చింది. ఇండోర్ పిచ్ మరీ పొడిగా ఉందని, బ్యాట్‌కు, బంతికి ఏ మాత్రం సమతూకం లేదని, పిచ్ ఆరంభం నుంచే స్పిన్నర్లకు సహకరించిందని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నాడు.
మ్యాచ్ ఆసాంతం బౌన్స్ అతిగా ఉండటంతో పాటు అస్థిరంగా ఉందని పేర్కొన్నాడు. ఈ నివేదికతో ఐసీసీ చర్యలు తీసుకుంది. అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా.. బీసీసీఐ ఆ పని చేయలేదు.
తొలి రోజు నుంచే స్పిన్‌కు విపరీతంగా సహరించడం బాలేదని భారత మాజీ ఆటగాళ్లు సైతం విమర్శించారు.

ఇంకా డిసైడ్ అవ్వలేదు..
ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ టెస్టుకు ఎలాంటి పిచ్ తయారు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలన్నా.. ఈ సిరీస్ సొంతం చేసుకోవాలన్నా ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు తప్పనిసరి.
అయితే అహ్మదాబాద్ క్యురేటర్లు మాత్రం ఈ మ్యాచ్ కోసం రెండు పిచ్‌లు సిద్దం చేశారు. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ పిచ్‌లను ఏర్పాటు చేశారు. బీసీసీఐ నిర్ణయం ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

బీసీసీఐ సూచనలు అందాకే...
చివరి టెస్ట్ పిచ్ ఎలా ఉండాలన్న దానిపై బీసీసీఐ ఇంకా ఒక నిర్ణయం తీసుకోనట్లే కనిపిస్తోంది. పిచ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటికొచ్చాయి. కానీ ఫైనల్ పిచ్ ఏదో చెప్పకపోవడంతో ఆసీస్ ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది.
పిచ్ తయారీకి సంబంధించి బీసీసీఐ నుంచి గానీ, టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి తమకు ఎలాంటి సూచనలు అందలేదని క్యురేటర్లు స్పష్టం చేశారు. మంగళవారం వరకు నాలుగో టెస్టుకు తయారు చేసిన రెండు పిచ్‌లను కప్పి ఉంచారు. మ్యాచ్‌కు దేన్ని ఉపయోగిస్తారో అని ఇంకా తెలియలేదు.

స్పిన్ పిచే.. కానీ..
'టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి మాకు ఏ సూచనలూ అందలేదు. స్థానిక క్యురేటర్లు మామూలు పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు. సీజన్ ఆసాంతం ఉన్నట్లే పిచ్ ఇప్పుడూ ఉంటుంది'' అని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి ఇంతకుముందు చెప్పాడు.
మంచి టెస్టు మ్యాచ్ పిచ్‌ను సిద్ధం చేయాలన్నదే తమ లక్ష్యమన్నాడు. ఈ మాటలను బట్టి స్పిన్ వికెటే అయినా.. కాస్త బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ సిడ్నీలోనే ఉన్న నేపథ్యంలో.. ఆఖరి టెస్టులోనూ ఆస్ట్రేలియాను స్మిత్ నడిపించనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications