IND vs AUS: రాహుల్ కోసం ఎంతమందిని బలి చేస్తారు? పాపం సంజూ, సర్ఫరాజ్.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన 18 మంది సభ్యులతో కూడిన జట్టులో ఈ సౌతిండియా స్టార్‌కు చోటు దక్కలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్ సాధించినా సంజూ శాంసన్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు.
పేలవ ఫామ్‌తో వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌ను మాత్రం నెత్తిన పెట్టుకొని మోస్తోంది. ఆడినా ఆడకున్నా అవకాశాలు ఇస్తామని చెప్పకనే చెబుతోంది. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ రాణిస్తుండటంతో.. రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తున్న బీసీసీఐ.. కొత్తగా అతని చేత వికెట్ కీపర్ అవతారమెత్తించింది.
కేఎల్ రాహుల్ కోసం
రాహుల్ కోసం సంజూ శాంసన్‌ను పక్కనపెట్టేస్తోంది. బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పినవన్నీ నిజాలేనని తేలుస్తూ ఆస్ట్రేలియాతో వన్డే, టెస్ట్ సిరీస్‌కు జట్లను ప్రకటించింది. చివరి రెండు టెస్టుల్లో అయినా అవకాశం దక్కుతుందని భావించిన సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, మనీశ్ పాండే వంటి ప్లేయర్ల నిరాశే ఎదురైంది.
చేతన్ శర్మ చెప్పినట్లుగా సంజూ శాంసన్ కెరీర్‌కు బీసీసీఐ ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేస్తోంది. గతేడాది వన్డేల్లో 66 సగటుతో పరుగులు చేసిన సంజూ శాంసన్‌ను ఏ మాత్రం పట్టించుకోలేదు.
సంజూ ఏ పాపం చేశాడు..
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. రిషభ్ పంత్ ఉన్నన్ని రోజులు సంజూ శాంసన్‌ను పక్కన పెట్టిన సెలెక్టర్లు.. అతని గైర్హాజరీలో కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సంజూ శాంసన్ ఏం తప్పు చేశాడని నిలదీస్తున్నారు.
కేఎల్ రాహుల్ కారణంగా టీమిండియా రెండు టీ20 ప్రపంచకప్‌లు ఓడిపోయిందనేది వాస్తవం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. అతని కోసం టాలెంటెడ్ ప్లేయర్లను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు.
సర్ఫరాజ్ కనబడటం లేదా..?
దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని మండిపడుతున్నారు. జీన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ ఇదే విషయాన్ని చెప్పాడు. భారత క్రికెట్ జట్టులో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ల వల్లే సంజూ శాంసన్, శిఖర్ ధావన్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్‌లకు అవకాశాలు దక్కడం లేదని స్పష్టం చేశాడు.
చేతన్ శర్మ రాజీనామాతో అయినా సర్ఫరాజ్‌కు అవకాశం దక్కవచ్చని చాలా మంది ఆశించారు. కానీ సర్ఫరాజ్ పేరును కూడా సెలెక్టర్ల పరిగణలోకి తీసుకోలేదని తాజా సెలెక్షన్‌తో అర్థమవుతోంది.
కెప్టెన్, కోచ్ అండదండలు ఉంటేనే..
జట్టులో కెప్టెన్, హెడ్ కోచ్ మద్దతో లేక బీసీసీఐ పెద్దల అండదండలు ఉంటే చాలు ఆడకున్నా జట్టులో నెగ్గుకురావచ్చనే ధోరణిలో టీమ్ సెలక్షన్స్ జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిభకు పట్టం కట్టడంలో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ దారుణంగా విఫలమవుతుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications