Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: సిక్సర్ కాస్త వికెట్‌గా.. మోయే మోయే! (వీడియో)

టీమిండియా స్టార్ ఆల్‌ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అతని అసాధారణ ఫీల్డింగ్‌కు సిక్సర్‌ కాస్త క్యాచ్ ఔట్‌గా మారింది.

అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్‌‌తో దూకుడుగా ఆడిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) పోరాటం ముగిసింది. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు బిత్తరపోయిన మిచెల్ మార్ష్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఆసీస్‌కు మోయే మోయే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Axar Patel takes one-hand stunning catch

కుల్దీప్ యాదవ్ వేసిన 9వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని కుల్దీప్ యాదవ్.. లెంగ్త్‌లో వేయగా మిచెల్ మార్ష్ భారీ షాట్ ఆడాడు. స్క్వేర్ లెగ్‌లో ఉన్న అక్షర్ పటేల్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి బంతిని ఒంటి చేత్తో అందుకున్నాడు. దాదాపు సిక్సర్ అనుకున్న బంతిని అక్షర్ అందుకోవడంతో మిచెల్ మార్ష్ ఆశ్చర్యానికి గురయ్యాడు.

ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 81 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ(41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92), సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/45), మార్కస్ స్టోయినీస్(2/56) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓటమిపాలైంది. ట్రావిస్ హెడ్(43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/37) మూడేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

Story first published: Monday, June 24, 2024, 23:32 [IST]
Other articles published on Jun 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+