IND vs AUS: అందుకే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యారు! 22 మంది ఇలానే పప్పులో కాలేసారు!

కాన్పూర్: ఆస్ట్రేలియాతో సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. వర్షం కారణంగా 8 ఓవర్ల పాటే సాగిన చిట్టి మ్యాచ్‌లో రోహిత్ 6 వికెట్లతో గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్ డిసైడర్ ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరగనుంది. అయితే రెండో టీ20లో భారత్ విజయానికి రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ ఓ కారణమైతే.. అక్షర్ పటేల్ సెన్సేషనల్ బౌలింగ్ మరో కారణం. ఎందుకంటే అతను 2 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా రెండు కీలక వికెట్లు తీసాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సైతం అక్షర్ సూపర్ బౌలింగ్ కారణంగానే ఓటమిపాలయ్యమని చెప్పాడు.

రనౌట్‌తో షురూ..
ఇక అక్షర్ బౌలింగ్‌లో ఔటైన ఇద్దరూ ఒకే తరహాలో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరగడం గమనార్హం. మ్యాచ్ 8 ఓవర్లే కావడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో రెండో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించిన కామెరూన్ గ్రీన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ మిడాన్ నుంచి విసిరిన వేగవంతమైన త్రోని చక్కగా కలెక్ట్ చేసుకున్న అక్షర్ పటేల్ రెప్పపాటులో బెయిల్స్ ఎగరగొట్టాడు. అంతకముందే గ్రీన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను నేలపాలు చేసిన విరాట్.. అంతలోనే తన సూపర్ ఫీల్డింగ్‌తో మైమరిపించాడు.

టర్న్ అవుతుందనే భ్రమలో ఉండి..
ఆ తర్వాత అదే ఓవర్‌లో ఆఖరి బంతికి అప్పుడే క్రీజులోకి వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ (0) బౌల్డయ్యాడు. మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ.. రౌండ్ ద వికెట్ వెళ్లిన అక్షర్ పటేల్ కాస్త వేగం పెంచి బంతిని విసిరాడు. అయితే.. బంతి టర్న్ అవుతోందని భ్రమపడిన మాక్స్‌వెల్ కాస్త బ్యాక్‌ఫుట్‌పైకి వెళ్లి స్లాప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ నేరుగా వెళ్లిన బంతి వికెట్లని గీరాటేసింది. ఆ తర్వాత నాలుగో ఓవర్ మొదటి బంతికి టిమ్ డేవిడ్ (2) కూడా ఇదే తరహాలో అక్షర్ పటేల్‌పై ఎదురుదాడి చేయబోయి క్లీన్ బౌల్డయ్యాడు. ఇక్కడ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్ బంతి టర్న్ అవుతోందని భ్రమపడి టైమ్ తీసుకుని ఆడబోయి ఒకేరీతిలో మూల్యం చెల్లించుకున్నారు.

ఈ ఇద్దరే కాదు.. ఈ ఏడాది 22 మంది..
అయితే ఈ ఇద్దరే కాదు.. ఇప్పటి వరకు 22 మంది కుడిచేతి వాటం బ్యాటర్లు ఇలానే బంతి టర్న్ అవుతుందని భ్రమపడి అక్షర్ బౌలింగ్‌లో ఔటయ్యారు.
అక్షర్ పటేల్ కుడి చేతి వాటం బ్యాటర్లకు బౌలింగ్ చేసేటప్పుడు బంతిని ఎక్కువగా టర్న్ చేయడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తుంటాడు. దాంతో టర్న్ అవుతోందని బంతిని ఆడితే అది నేరుగా వెళ్లి వికెట్లని గీరాటేస్తుంది. ఈ ఏడాది టీ20ల్లో అక్షర్ పటేల్ ఇప్పటికే 22 మంది కుడిచేతి వాటం బ్యాటర్లను ఔట్ చేయడం గమనార్హం.

రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాథ్యూవేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో 32 పరుగులిచ్చి దారుణంగా విఫలమయ్యాడు.
అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసి మరో 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. దినేశ్ కార్తీక్(2 బంతుల్లో సిక్స్, ఫోర్‌తో 10 నాటౌట్) అసలు సిసలు ఫినిషింగ్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications