Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: రోలర్లు, రేకు డబ్బాలతో ప్రాక్టీస్.. గెలుపు కోసం ఆసీస్ తిప్పలు! (వీడియో)

IND vs AUS: Australia use Rollers, football and steel board for fielding drills goes viral

ఇండోర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస పరాజయాలతో చతికిలపడిన ఆస్ట్రేలియా.. విజయం కోసం నానా తిప్పలు పడుతోంది. ఇండోర్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటుంది. భారత పర్యటనకు ముందు వరకు వరుసగా విజయాలతో జోరు కనబర్చిన ఆసీస్.. ఉపఖండ పిచ్‌ల్లో మాత్రం తేలిపోతుంది. భారత స్పిన్‌ను ఆడలేక తెగ ఇబ్బంది పడుతోంది.

సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అంత సులువు కాదని భావించిన ఆసీస్.. మంచి హోమ్ వర్క్ చేసి భారత్‌లో అడుగుపెట్టింది. ప్రత్యేక ప్రాక్టీస్ క్యాంప్‌లో భారత యువ స్పిన్నర్లతో గంటలకొద్ది ప్రాక్టీస్ చేసింది. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు.

పేలవ ఫీల్డింగ్‌లతో..

పేలవ బ్యాటింగ్‌‌కు తోడు చెత్త ఫీల్డింగ్ ఆ జట్టు కొంపముంచింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌, ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్‌లో స్మిత్ చేజార్చిన క్యాచ్‌లు ఆసీస్ పతనాన్ని శాసించాయి. తొలి టెస్ట్‌లో రవీంద్ర జడేజా ఇచ్చిన సునాయ క్యాచ్‌ నేలపాలు చేయడం ఆసీస్ ఓటమిని శాసించింది. రెండో టెస్ట్‌లో అక్షర్ పటేల్ ఇచ్చిన క్యాచ్‌ను చేజార్చడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది.

ఈ క్రమంలోనే ఇండోర్ టెస్ట్‌లో ఈ తరహా తప్పిదాలు పునరావృతం కావద్దని ఆసీస్ గట్టిగా ప్రిపేర్ అవుతోంది. ఆదివారమే ఇండోర్‌లో అడుగుపెట్టిన ఆసీస్.. సోమవారం క్యాచ్‌లు ప్రాక్టీస్ చేసింది.

రేకు డబ్బాలతో ప్రాక్టీస్..

రేకు డబ్బాలతో ప్రాక్టీస్..

అయితే రెగ్యూలర్ ఫార్మాట్‌లో కాకుండా చాలా యూనిక్‌గా ప్రిపేర్ అవుతోంది. స్లిప్ క్యాచ్‌లు పకడ్బందీగా అందుకోవడం కోసం పిచ్ రోలర్, రేకుడబ్బాలతో ప్రాక్టీస్ చేస్తోంది. ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ బొర్వెక్ పర్యవేక్షణలో స్మిత్, లబూషేన్, హ్యాండ్స్‌ కోంబ్ తదితర ఆటగాళ్లు స్లిప్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు.

ఈ సెషన్‌కు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. మాములు పిచ్ మీద కంటే రోలర్, రేకు డబ్బాలపై బంతి ఎక్కువగా మెలికలు తిరుగుతది. టర్నింగ్ పిచ్‌లపై స్లిప్‌లో క్యాచ్‌లు అందుకోవడానికి ఆసీస్ ఆటగాళ్లు ఇబ్బంది పడుతుండటంతో ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదేకాకుండా బేస్ బాల్ బ్యాట్‌తో కూడా క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

విజయమే లక్ష్యంగా..

విజయమే లక్ష్యంగా..

బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య ఇండోర్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియా సొంతమవడంతో పాటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్, డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖారారు అవుతాయి. మరోవైపు ఆసీస్ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటది. ఈ క్రమంలోనే ఆ జట్టు ఇండోర్ టెస్ట్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది.

Story first published: Monday, February 27, 2023, 16:54 [IST]
Other articles published on Feb 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+