Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘ఆడలేక మద్దెల ఓడు’అన్నట్లుంది ఆసీస్ పని.. ఓటమి ఒప్పుకోలేక పిచ్‌పై నిందలు!

IND vs AUS: Australia need to forget the pitch-doctoring allegations and adapt conditions

హైదరాబాద్: 'మేం బ్యాటింగ్ చేసినప్పుడు ఫ్లాట్‌గా మారి.. బౌలింగ్ చేసేటప్పుడు టర్నింగ్ ట్రాక్‌గా మారుతుంది.'తొలి టెస్ట్ విజయానంతరం పిచ్‌‌పై ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రికెటర్లు చేసిన ఆరోపణలను ఉద్దేశించి టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలివి. స్పిన్ పిచ్‌లకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేక చేతులెత్తేసిన ఆసీస్.. ఓటమిని అంగీకరించలేక పిచ్‌లపై నిందలు మోపుతోంది.

ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 263 పరుగులు చేసినప్పుడు.. టీమిండియాను 262కు ఆలౌట్‌ చేసినప్పుడు.. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలు 61/1తో పటిష్టంగా కనిపించినప్పుడు ఆ జట్టుకు స్పిన్‌ వికెట్ కనిపించలేదు. అయితే ఆదివారం ఉదయం గంటన్నర వ్యవధిలో.. 110 బంతుల్లో 9 వికెట్లు కోల్పోయి 113 పరుగులకే ఆలౌటవ్వగానే ఆసీస్ మాజీ ఆటగాళ్లు పిచ్‌లపై నిందలు మోపడం మొదలుపెట్టారు.

పిచ్‌ల గురించి మీరే మాట్లాడాలి..

పిచ్‌ల గురించి మీరే మాట్లాడాలి..

అనుకూల పిచ్‌లతో ప్రత్యర్థి జట్లను ఓడిస్తున్నారని టీమిండియా విజయాలను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు భారత్‌ ఆధిపత్యం రుచించకపోవడం సర్వ సాధారణమే. కానీ తమకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేసుకుంటారన్న ఆరోపణలే అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆసీస్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా సహా ఎవరి దేశాల్లో వారికి అనుకూలంగానే పిచ్‌లు ఉంటాయి. ఇంగ్లండ్‌లో అండర్సన్‌, బ్రాడ్‌.. ఆసీస్‌లో స్టార్క్‌, కమిన్స్‌లకు అనుకూలంగా పిచ్‌లు సిద్దం చేస్తారనేది కాదనలేని నిజం. ఇటీవలే బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు రెండు రోజులు కూడా సాగకపోవడం అక్కడి పిచ్‌ల పరిస్థితికి నిదర్శనం.

స్పిన్ ఆడేలేక..

స్పిన్ ఆడేలేక..

ఢిల్లీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా వైఫల్యానికి ప్రధాన కారణం షాట్ సెలెక్షన్, ఫుట్‌వర్క్ లోపం. స్పిన్ బౌలింగ్‌ను స్వీప్ షాట్లతో ఎదుర్కోవడం తప్పా మరో ఆప్షన్ లేదన్నట్లు ఆడారు. పిచ్‌ అలవాట పడకముందే స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడబోయి వికెట్లు పారేసుకున్నారు. అశ్విన్‌, జడేజా బౌలింగ్‌లో స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌లకు ప్రయత్నించి ఆరుగురు ఆసీస్ బ్యాటర్లు ఔటయ్యారు. స్పిన్నర్లను ఎదుర్కోడానికి ఏడెనిమిది రకాల షాట్లు ఉన్నాయన్న సంగతిని ఆస్ట్రేలియా బ్యాటర్లు పూర్తిగా మరిచిపోయారు. ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ మొదటి బంతినే సిక్సర్‌ బాదడానికి స్వీప్‌ ఆడి క్లీన్‌బౌల్డ్‌ అవ్వడం దీనికి నిదర్శనం.

అదేం రాకెట్ సైన్స్ కాదు..

అదేం రాకెట్ సైన్స్ కాదు..

క్రీజు వదిలి.. వికెట్ల ముందుకొచ్చి డిఫెన్స్‌ ఆడొచ్చన్న టెక్నిక్‌ను ఆసీస్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లు మరిచిపోయారు. ఇప్పుడున్న వాళ్లలో పుజారా ఒక్కడే అలా డిఫెన్స్ చేయగలుగుతున్నాడు. ఆదివారం నాటి ఇన్నింగ్స్‌లోనూ పుజారా చాలా బంతుల్ని స్టెప్ ఔట్ అయి డిఫెండ్‌ చేశాడు. ప్యాడ్లను తాకడానికి ముందే బ్యాటుతో బంతిని డిఫెండ్‌ చేసే టెక్నిక్ కనిపించడం లేదు. వైవిధ్యమైన స్పిన్‌ బంతులను ఎదుర్కొనేందుకు భిన్నమైన బ్యాటింగ్‌ టెక్నిక్‌లు ఉన్నాయనే విషయాలను బ్యాటర్లు తెలుసుకోలేకపోతున్నారు.

పాత వీడియోలు చూస్తే చాలు..

పాత వీడియోలు చూస్తే చాలు..

పరిస్థితులకు అలవాటు పడకుండా.. పిచ్‌పై అవగాహన లేకుండా.. స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ వంటి షాట్లతోనే స్పిన్‌ను అడ్డుకోవచ్చని భావిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. చివరి రెండు టెస్టుల్లో అశ్విన్‌, జడేజాలను సమర్థంగా ఎదుర్కోడానికి ఆసీస్‌ బ్యాటర్లకు రాకెట్‌ సైన్స్‌ అవసరం లేదు. గావస్కర్‌, గోవర్‌, ఛాపెల్‌ సోదరులు, సచిన్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌ల పాత బ్యాటింగ్‌ వీడియోలు చూస్తే సరిపోతుంది.

Story first published: Monday, February 20, 2023, 8:35 [IST]
Other articles published on Feb 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+