IND vs AUS: బాంచత్.. బాపు హాఫ్ సెంచరీ.. గట్టెక్కిన టీమిండియా!

న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(115 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్‌లతో 74) 'బాంచత్' ఇన్నింగ్స్ ఆడాడు. 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగిన భారత ఇన్నింగ్స్‌కు అసాధారణ బ్యాటింగ్‌తో ఊపిరి అందించాడు. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(71 బంతుల్లో 5 ఫోర్లతో 37)తో కలిసి 8వ వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ సిరీస్‌లోనే టీమిండియాకు ఇది అతిపెద్ద భాగస్వామ్యం. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఆస్ట్రేలియా స్కోర్‌కు ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.
21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. అక్షర్ పటేల్ సూపర్ బ్యాటింగ్‌తో 262 పరుగులు చేసింది. దాంతో ఆసీస్‌కు ఒక్క పరుగు ఆధిక్యం లభించింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ(84 బంతుల్లో 4 ఫోర్లతో 44), రవీంద్ర జడేజా(74 బంతుల్లో 4 ఫోర్లతో 26) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ ఐదు వికెట్లు తీయగా.. టాడ్ మర్ఫీ, మాథ్యూ రెండేసి వికెట్లు పడగొట్టారు. కమిన్స్ ఓ వికెట్ దక్కింది.

రాహుల్, పుజారా విఫలం..
రెండో రోజు ఆట ప్రారంభంలోనే టీమిండియాకు నాథన్ లయన్ షాకిచ్చాడు. వరుస ఓవర్లలో కెప్టెన్ రోహిత్(32) శర్మతో పాటు కేఎల్ రాహుల్(17), పుజారా(0), శ్రేయస్ అయ్యర్(4)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా 88/4 స్కోర్‌తో తొలి సెషన్ ముగించారు. రెండో సెషన్‌లోనూ నిదానంగా ఆడిన ఈ జోడీ.. ఐదో వికెట్‌కు 59 పరుగులు జోడించింది. ప్రమాదకంగా మారిన ఈ జోడీని మర్ఫీ విడదీసాడు. జడేజా(26)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం దక్కలేదు.

కోహ్లీ వికెట్‌పై దుమారం..
ఆ కొద్ది సేపటికే వివాదాస్పద రీతిలో విరాట్ కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు. యువ స్పిన్నర్ మాథ్యూ కున్నేమన్ బౌలింగ్‌లో విరాట్ వికెట్ల ముందు దొరికిపోగా... ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి.. బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి తాకినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి వివాదాస్పద రీతిలో ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లీ సైతం ఆగ్రహంగానే మైదానం వీడాడు.

బాపు బాంచెత్ ఇన్నింగ్స్..
ఆ తర్వాత వచ్చిన కేఎస్ భరత్(6)ను ఔట్ చేసిన లయన్ ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్, జడేజా అసాధారణ ఇన్నింగ్స్ ఆడారు. మంచి బంతులను గౌరవిస్తూ.. వీలు చిక్కిన బాల్స్‌ను ఈ జోడీ బౌండరీకి తరలించింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. అతను కొట్టిన మూడు సిక్స్‌లు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. 94 బంతుల్లో భారీ సిక్సర్‌తో అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అక్షర్‌కు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ.

అక్షర్ ఔటవ్వడంతో..
ఓ దశలో టీమిండియా 200 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ అక్షర్-అశ్విన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును గట్టెక్కించారు. ఈ కీలక భాగస్వామ్యాన్ని కొంత బంతి సహకారంతో కమిన్స్ విడదీసాడు. అశ్విన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కూడా అక్షర్ పటేల్ తన షాట్లతో అలరించాడు. టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో కమిన్స్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. షమీని మాథ్యూ బౌల్డ్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications