IND vs AUS: సిరాజ్‌ను ఎగతాళి చేసిన ఆసీస్ ఫ్యాన్స్.. నోరు మూసుకోమన్న కోహ్లీ! (వీడియో)
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హీటెక్కింది. ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ తారా స్థాయికి చేరి యుద్ద వాతావారణాన్ని తలపిస్తోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు నవ్వుతూ.. స్లెడ్జ్ చేసుకున్నారు. కానీ అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ సమరంలో స్లెడ్జింగ్ హద్దులు ధాటుతోంది.
భారత బ్యాటింగ్ సమయంలో ఆసీస్ బౌలర్లు దూకుడుగా సంబరాలు చేసుకుంటూ.. నోటికి పనిచెప్పారు. భారత బౌలర్లు కూడా అదే తరహాలో స్లెడ్జింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్లను కవ్విస్తున్నారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ దూకుడుగా వ్యవహరిస్తూ.. ఈ సిరీస్‌పై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

A HEATED MOMENT BETWEEN HEAD AND SIRAJ.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2024
- Travis Head with a sensational 140 (141) at the Adelaide Oval. 🙇♂️pic.twitter.com/fchP5BDbuV
ఛల్.. పో బే.. పో!
ఈ మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ట్రావిస్ హెడ్‌ను మహమ్మద్ సిరాజ్ స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతకుముందే ట్రావిస్ హెడ్ సిక్స్ కొట్టడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సిరాజ్.. వికెట్ తీసి గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. సిరాజ్ సంబరాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రావిస్ హెడ్.. తన నోటికి పని చెప్పాడు.
సిరాజ్ వెంటనే 'ఛల్ పో బే.. పో'అన్నట్లు సైగ చేశాడు. దాంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ట్రావిస్ హెడ్‌కు సిరాజ్ సెండాఫ్ ఇవ్వడంపై ఆసీస్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. సిరాజ్‌ను ఎగతాళి చేస్తూ గట్టిగా కామెంట్ చేశారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిరాజ్ మాత్రం తన బౌలింగ్‌తోనే అభిమానులకు బదులిచ్చాడు.
నోరు మూసుకోమన్న కోహ్లీ..
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఔటైన అనంతరం విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ చర్చనీయాంశమైంది. భారత ఆటగాళ్లను తక్కువ చేస్తూ అల్లరి చేస్తున్న ఆసీస్ ప్రేక్షకులను నోరు మూసుకోవాలని కోహ్లీ సూచించాడు. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బ్యాటర్ల సహనానికి పరీక్షగా నిలిచిన మార్నస్ లబుషేన్‌ను నితీష్ కుమార్ రెడ్డి స్టన్నింగ్ డెలివరీ.. యశస్వి జైస్వాల్ సంచలన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. దాంతో కోహ్లీ ఆసీస్ ప్రేక్షకుల వైపు నోరు మూసుకోవాలని సైగ చేశాడు.
— Sunil Gavaskar (@gavaskar_theman) December 7, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications