IND vs AUS: టీమిండియా కొంపముంచిన సూర్య.. సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్!

చెన్నై: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోయింది. చెన్నై వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 21 పరుగులతో టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47), అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/57), మహమ్మద్ సిరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిటిన టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ(72 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 54), హార్దిక్ పాండ్యా(40 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40)రాణించినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా(4/45) నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. అష్టన్ అగర్ రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌తో పాటు అక్షర్ పటేల్ రనౌట్ టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ ఇద్దరి దారుణ వైఫల్యంతో టీమిండియా బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దాంతో భారీ షాట్ల ఆడబోయి వికెట్లు పారేసుకున్నారు. ఈ సిరీస్ ఓటమితో సొంతగడ్డపై టీమిండియా వరుస సిరీస్ విజయాలకు చెక్ పడింది. ఏడు వన్డేల సిరీస్ తర్వాత టీమిండియా ఓటమిపాలైంది.

ఓపెనర్లు శుభారంభం ఇచ్చినా..
270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 37) శుభారంభం అందించారు. తొలి ఓవర్ నుంచే దూకుడు ఆడటంతో 9 ఓవర్లలోనే టీమిండియా 65 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సీన్ అబాట్ విడదీసాడు. రోహిత్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. శుభ్‌మన్ గిల్‌ను ఆడమ్ జంపా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

కోహ్లీ హాఫ్ సెంచరీ చేసినా..
ఈ పరిస్థితుల్లో రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. 69 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ఆడమ్ జంపా విడదీసాడు. కేఎల్ రాహుల్(32)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇస్తూ అక్షర్ పటేల్(2)ను పంపించగా.. అతను రనౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన హార్దిక్ సాయంతో విరాట్ 61 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సూర్య గోల్డెన్ డక్..
ఈ పరిస్థితుల్లో అష్టన్ అగర్ వరుసగా రెండు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు. విరాట్ కోహ్లీని క్యాచ్ ఔట్ చేసిన అష్టన్ అగర్.. మరుసటి బంతికే సూర్యకుమార్ యాదవ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సూర్య గోల్డెన్ డక్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఆసీస్ వైపు మళ్లింది. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా పోరాడినా.. చేజింగ్ రన్‌రేట్ పెరగడంతో భారీ షాట్లు ఆడాల్సి వచ్చింది. ఈ క్రమంలో హార్దిక్, జడేజా క్యాచ్ ఔటయ్యారు.
స్టోయినిస్ వేసిన 48వ ఓవర్‌లో మహమ్మద్ షమీ(14) వరుసగా 6, 4 బాది ఆశలు రేకెత్తించినా మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరి వికెట్‌గా కుల్దీప్ యాదవ్(6)రనౌటవ్వడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications