Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆసీస్‌దే బ్యాటింగ్.. ఏకైక మార్పుతో టీమిండియా!

IND vs AUS: Australia batting 1st, Shami replaces Siraj in India Playing XI

అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆసీస్ తాత్కలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పిన స్మిత్.. గత మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని గుర్తు చేశాడు. మళ్లీ ఆ ప్రదర్శనను పునరావృతం చేస్తారో లేదో చూడాలన్నాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఏం చేయాలో తమకు తెలుసని, తుది జట్టులో ఒక మార్పు చేశామని రోహిత్ వెల్లడించాడు. గత మ్యాచ్ ఓటమి అనంతరం తాము సమావేశమై తమ లోపాలను చర్చించుకున్నామని చెప్పాడు. గత మూడు మ్యాచ్‌ల్లో పిచ్ ఒక్కటే ఫలితాలను శాసించలేదని, చాలా అంశాలున్నాయని చెప్పాడు. ఈ పిచ్.. ఐదు రోజుల పాటు ఒకేలా ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పాడు.

75 ఏళ్ల భారత్-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ ఈ మ్యాచ్‌ తొలి రోజు స్టేడియానికి వచ్చారు. టాస్‌కు ముందు ఇరు దేశాల ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్‌ కారులో స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. నరేంద్ర మోదీ టాస్ కాయిన్ ఎగరవేస్తాడని ప్రచారం జరిగినా.. ప్రధానులు ఆటలో భాగమవ్వలేదు. మైదానంలో తిరిగిన అనంతరం స్టేడియం లోపలి నిర్మణాలను చూశారు. టీమిండియా సాధించిన విజయాలతో పాటు మైదానం లోపల ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీలను తిలకరించారు. మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి.. ఇరు దేశాల ప్రధానులకు వివరించాడు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవి చంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), పీటర్ హ్యాండ్‌స్కోంబ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ(కీపర్), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లయన్

Story first published: Thursday, March 9, 2023, 9:24 [IST]
Other articles published on Mar 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+