For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS:ఆ ఓపెనర్‌‌పై వేటు.. భారత్‌తో చివరి రెండు టెస్ట్‌లకు ఆస్ట్రేలియా జట్టు ఇదే!

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరగనున్న చివరి రెండు టెస్ట్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) భారీ మార్పులతో జట్టును ప్రకటించింది. జట్టులోకి కొత్తగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంది. వరుసగా మూడు టెస్ట్‌ల్లో విఫలమైన ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీపై వేటు వేసింది.

అతని స్థానంలో సామ్ కోన్‌స్టాస్ అనే యువ ఓపెనర్‌కు అవకాశం కల్పించింది. అతనికి తొలిసారి ఆస్ట్రేలియా జట్టు పిలుపు అందింది. 19 ఏళ్ల ఈ కుర్రాడు ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 42.23 సగటుతో 718 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు.

IND vs AUS Australia Axe Nathan McSweeney Sam Konstas receives maiden callup for Final 2 Tests

సామ్ కోన్‌స్టాస్‌తో పాటు జై రిచర్డ్‌సన్, బ్యూ వెబ్‌స్టర్ ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయంతో జోష్ హజెల్ వుడ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానాన్ని జై రిచర్డ్‌సన్ భర్తీ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా ధీమా వ్యక్తం చేసింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో టాపార్డర్‌ తడబడటంతోనే మార్పులు చేశామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు.

చివరి రెండు మ్యాచ్‌ల్లో విభిన్నమైన లైనప్‌ను ప్రయత్నించాలనుకుంటున్నామన్నాడు. నాథన్ మెక్‌స్వీనీ గత 6 ఇన్నింగ్స్‌ల్లో 10, 0, 39, 10నాటౌట్, 9, 4 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. ఈ 6 ఇన్నింగ్స్‌ల్లో మెక్‌స్వీనీ ఐదు సార్లు బుమ్రా బౌలింగ్‌లోనే ఔటవ్వడం గమనార్హం.

డిసెంబర్ 26 నుంచి మెల్ బోర్న్ వేదికగా మూడో టెస్ట్‌ ప్రారంభం కానుండగా.. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్ట్‌ జరగనుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్ట్‌తో ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్‌ కోన్‌స్టాస్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ విజయం సాధించగా.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్‌ టెస్ట్‌లో ఆసీస్ గెలుపొందింది. గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. టెయిలెండర్ల అసాధారణ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిని తప్పించుకుంది. చివరి రెండు టెస్ట్‌లు గెలిచిన జట్టే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2025 ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

చివరి రెండు టెస్ట్‌లకు ఆస్ట్రేలియా జట్టు:

ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లీస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కోన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, జై రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.

Story first published: Friday, December 20, 2024, 10:16 [IST]
Other articles published on Dec 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+