Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: జడేజా ఫిఫర్.. అశ్విన్ తీన్మార్.. ఆస్ట్రేలియా బేజార్..!!

IND vs AUS: Australia all out for 177 as Ravindra Jadeja takes five

నాగ్‌పూర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బౌలర్లు దుమ్మురేపారు. రవీంద్ర జడేజా(5/47) ఐదు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్(3/42) మూడు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 177 పరుగులకు కుప్పకూలింది. మార్నస్ లబుషేన్(123 బంతుల్లో 8 ఫోర్లతో 49), స్టీవ్ స్మిత్(107 బంతుల్లో 7 ఫోర్లతో 37), పీటర్ హ్యాండ్‌స్కోంబ్(84 బంతుల్లో 4 ఫోర్లతో 31), అలెక్స్ క్యారీ(33 బంతుల్లో 7 ఫోర్లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మహమ్మద్ షమీ, సిరాజ్ తలో వికెట్ తీసారు.
శుభారంభం లేదు..

శుభారంభం లేదు..

టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), ఉస్మాన్ ఖవాజా (1) ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. సిరాజ్ ఈ మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఖవాజా ఔటవ్వగా... ఆ మరుసటి ఓవర్లోనే అద్భుతమైన డెలివరీతో డేవిడ్ వార్నర్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 2 పరుగలకే ఓపెనర్ల వికెట్లను ఆస్ట్రేలియా కోల్పోయింది. అయితే లబుషేన్, స్మిత్ ఇద్దరూ మరో వికెట్ పడకుండానే ఆడటంతో ఆసీస్ 76/2తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

మలుపు తిప్పిన జడేజా..

మలుపు తిప్పిన జడేజా..

లంచ్ బ్రేక్ అనంతరం క్రీజులో పాతుకు పోయిన స్మిత్, లబుషేన్ జోడీని జడేజా విడదీసాడు. భారీ షాట్ కోసం క్రీజును ధాటిన లబుషేన్‌ను తెలుగు తేజం కేఎస్ భరత్ సూపర్ స్టంప్‌తో పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి బంతికే మ్యాట్ రేన్‌షా(0) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ పరిస్థితుల్లో పీటర్ హ్యాండ్స్‌కోంబ్, అలెక్స్ క్యారీ(36) భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. 53 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని అశ్విన్ విడదీసాడు. క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు.

స్పిన్నర్లకు విల విల..

స్పిన్నర్లకు విల విల..

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్(6) కోహ్లీ సాయంతో అశ్విన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చగా.. అరంగేట్ర ప్లేయర్ టాడ్ ముర్ఫీ(0)ని ఎల్బీగా ఔట్ చేయడంతో ఆసీస్ 173 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఈ స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లిన ఆసీస్.. అనంతరం 8 బంతుల వ్యవధిలోనే చివరి రెండు వికెట్లు కోల్పోయింది. పీటర్ హాండ్‌స్కోంబ్(31)ను జడేజా ఔట్ చేయగా.. స్కాట్ బోలాండ్‌ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

Story first published: Thursday, February 9, 2023, 15:20 [IST]
Other articles published on Feb 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+