Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్.. ఆ పాపానికి పరిహారం: అంబటి రాయుడు

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. ఒత్తిడిని అధిగమిస్తూ అతను ఆడిన తీరు అమోఘమని రాయుడు ప్రశంసించాడు. ఆస్ట్రేలియాతోనే జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో రాహుల్ చేసిన తప్పిదానికి తాజా ఇన్నింగ్స్‌ పరిహారమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.

జిడ్డు బ్యాటింగ్‌తో..
ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. విరాట్ కోహ్లీతో కలిసి తీవ్ర ఒత్తిడిలో రాహుల్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆఖరి వరకు క్రీజులో నిల్చొని భారీ సిక్సర్‌తో భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఇదే ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో కేఎల్ రాహుల్(107 బంతుల్లో 66) జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. దాంతో అప్పట్లో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ కేఎల్ రాహుల్ క్రీజులో ఉంటే అభిమానులు భయపడుతారు. అంతలా ఈ ఇన్నింగ్స్ అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది.

IND vs AUS Ambati Rayudu Says KL Rahul s knock was redemption for World Cup final

ఆ పాపానికి విముక్తి..
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాయుడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కేఎల్ రాహుల్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఎందుకంటే నెంబర్ 6లో ఆడటం అతనికి అలవాటు కాదు. కానీ అపారమైన పరణితి కనబరుస్తూ ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. అతను తీసుకున్న రిస్క్.. ఆడిన షాట్స్ అమోఘం. ఒత్తిడి మొత్తాన్ని అతనే భరిస్తూ.. విరాట్ కోహ్లీకి స్వేచ్చగా ఆడే అవకాశం కల్పించాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో రాహుల్ చేసిన తప్పిదానికి తాజా ఇన్నింగ్స్‌తో విముక్తి లభించిందనుకుంటున్నా. ఆ తప్పిదాన్ని అతను మనసులోనే ఉంచుకొని.. చక్కగా సరిదిద్దుకున్నాడు. ఫైనల్లోనూ అతను ఇదే తరహా ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా.

టీమిండియా అదృష్టం..
జట్టులోని ప్రతీ ఒక్కరికి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సామర్థ్యం ఉండటం టీమిండియా చేసుకున్న అదృష్టం. అందరూ తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా రాణిస్తూ టీమిండియాకు విజయాలు అందిస్తున్నారు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. విరాట్ కోహ్లీతో కలిసి ఈ రోజు బాధ్యత తీసుకున్నారు. ప్రతీ ప్లేయర్ తాము ఓ మ్యాచ్ విన్నర్ అనే విషయాన్ని రుజువు చేసుకున్నారు. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం టీమిండియా చేసుకున్న అదృష్టం'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, March 5, 2025, 16:46 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+