Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ప్చ్.. భారత్ ఓటమి! సిరీస్ ఆసీస్ కైవసం!

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ మైదానం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లోనూ టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో మూడు టీ20ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. రిచా ఘోష్ (28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), షెఫాలీ వర్మ(17 బంతుల్లో 6 ఫోర్లతో 26), స్మృతి మంధాన(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) పర్వాలేదనిపించగా... మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

 IND vs AUS: Alyssa Healy and opener Beth Mooney’s fifties power Australia to series win

ఆస్ట్రేలియా బౌలర్లలో జార్జియో వేర్‌హమ్(2/24), అన్నబెల్ సదర్లాండ్(2/12) రెండేసి వికెట్లు తీయగా.. అష్లే గార్డనర్, మేఘన్ స్కట్ తలో వికెట్ తీసారు.అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 149 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఆసీస్ ఓపెనర్లు అలిస్సా హీలీ(38 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 55), బెత్ మూనీ(45 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటా.. తహిళా మెక్‌గ్రాత్(15 బంతుల్లో 4 ఫోర్లతో 20) మెరుపులు మెరిపించింది.

భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ ఓ వికెట్ దక్కింది. పేలవ బ్యాటింగ్‌కు తోడు చెత్త బ్యాటింగ్ టీమిండియా ఓటమిని శాసించింది.

సాధారణ లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. ఓపెనర్ల సూపర్ బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. అలిస్సా హీలీ, బెత్ మూనీ ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ క్రీజులో పాతుకుపోయింది. అలీస్సా హీలీని దీప్తి శర్మ ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు నమోదైన 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ధాటిగా ఆడే ప్రయత్నం చేసి తహిళా మెక్‌గ్రాత్‌ను ఔట్ చేసిన పూజా వస్త్రాకర్.. మరుసటి బంతికే ఎల్లిస్ పెర్రీ(0) గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చింది. ఫోబో లిట్చిఫీల్డ్(17 నాటౌట్) సాయంతో బెత్ మూనీ ఆసీస్ విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.

Story first published: Tuesday, January 9, 2024, 22:31 [IST]
Other articles published on Jan 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+